Wednesday, May 15, 2024

క్రిస్మస్ కానుకగా…

- Advertisement -
- Advertisement -

Tuck Jagadish first look release on dec 25

 

నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘టక్ జగదీష్’. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లో నాని లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. “ఈ క్రిస్మస్‌కు టక్ జగదీష్ ఫస్ట్ లుక్‌” అని హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశాడు నాని. శివ నిర్వాణ దర్శకత్వంలో రెండోసారి నటిస్తున్నాడు ఈ నేచురల్ స్టార్. గతంలో వచ్చిన హిట్ మూవీ ‘నిన్ను కోరి’ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో మూవీ ఇది. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోందని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ కొంత భాగం లాక్ డౌన్‌కు ముందే పూర్తి చేశారు. మిగిలిన పార్ట్‌ను చిత్రీకరించేందుకు ఇటీవలే షూటింగ్ ప్రారంభించింది చిత్రయూనిట్. ప్రస్తుతం చిత్రీకరణ చివరి షెడ్యూల్లోకి ప్రవేశించింది. నాని సరసన రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News