Monday, May 13, 2024

కొత్త ఐటి రూల్స్‌కు ట్విట్టర్ ఓకే

- Advertisement -
- Advertisement -

Twitter is finally agree for new IT Rules

 

న్యూఢిల్లీ :సామాజిక మాధ్యమాల కట్టడికి కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకు వచ్చిన ఐటి విధానాలకు ట్విట్టర్ యాజమాన్యం ఎట్టకేలకు అంగీకరించింది. ఈచట్టం ప్రకారం ట్విట్టర్‌కు ప్రభుత్వానికి అనుసంధానంగా ప్రత్యేక అధికారిని మే 28న నియమించినట్టు సోమవారం ఢిల్లీ హైకోర్టుకు వివరించింది. ఇప్పటికే ఫేస్‌బుక్‌తోపాటు సోషల్ మీడియా , ఒటిటి సంస్థలు ఈ నియమావళిని అంగీకరించాయి. అయితే వీటిలో కొన్ని మార్పులు చేయాలంటూ ప్రతిపాదించాయి. అయితే ఈ విషయంలో ట్విటర్ యాజమాన్యం కాస్త మొండిగా వ్యవహరించింది. గత ఫిబ్రవరి 25న కేంద్రం ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి అమలుకు ఇచ్చిన మూడు నెలల గడువు ఈనెల 25 తో ముగియడంతో ఈనెల 26న కేంద్రం రంగం లోకి దిగింది. సవరించిన నిబంధనల అమలుకు సామాజిక మాధ్యమాలు తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని ప్రభుత్వం ప్రశ్నించింది.

అయితే ఇప్పటివరకు తన వైఖరేమిటో చెప్పని ట్విట్టర్ కేంద్ర నియమావళికి అంగీకారం తెల్పడం గమనార్హం. అయితే ఇదే సమయంలో ట్విట్టర్ కార్యాలయంలో ఢిల్లీ పోలీసులు తనిఖీ చేపట్టడం సంచలనంగా మారింది. తమ ఉద్యోగుల భద్రతపై , వాక్సాతంత్య్రానికి కలుగుతున్న ముప్పుపై ఆందోళన కలుగుతోందని ట్విట్టర్ ప్రకటించింది.దీనిపై కేంద్రం ఘాటుగా స్పందిస్తూ ట్విట్టర్ ప్రకటన భారత దేశాన్ని అపఖ్యాతిపాలు చేసేదిగా ఉందని విమర్శించింది. ప్రపంచం లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌పై తన షరతులను రుద్దే ప్రయత్నం ట్విట్టర్ చేస్తోందని ఆరోపించింది. ఈ దేశ చట్టాలకు ట్విట్టర్ లోబడి పని చేయాలని స్పష్టం చేసింది. అంతేకాదు లడఖ్‌ను చైనాలో భాగంగా చూపే ట్వీట్లను తొలగించడంలో ట్విట్టర్ చాలా జాప్యం చేసిందని కేంద్ర ప్రభుత్వం గుర్తు చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News