Tuesday, April 30, 2024

జూన్‌లో స్పుత్నిక్ వి రాక: కేజ్రీవాల్ ఆశాభావం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రష్యాకు చెందిన కొవిడ్-19 వ్యాక్సిన్ స్పుత్నిక్ వి మొదటి కంసైన్‌మెంట్ జూన్‌లో వచ్చే అవకాశం ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం తెలిపారు. కరోనా వైరస్‌పై పోరాటంలో వ్యాక్సినేషన్ అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఢిల్లీలో ప్రస్తుతం 944 మ్యూకోమైకోసిస్(బ్లాక్ ఫంగస్) కేసులు ఉన్నాయని, ఇందులో 300 కేసులు కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్నాయని చెప్పారు. సోమవారం జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక వ్యాక్సినేషన్ ప్రక్రియను నగరంలోని ఒక స్కూలులో ఆయన ప్రారంభిస్తూ జర్నలిస్టుల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. 45 సంవత్సరాలు పైబడిన వారితోపాటు 18-44 సంవత్సరాల మధ్య వయస్కులకు కూడా వ్యాకిన్ ఇస్తున్నామని ఆయన తెలిపారు. బ్యాక్ ఫంగస్ చికిత్సకు సంబంధించిన మందుల కొరత తీవ్రంగా ఉందని, శనివారం వెయ్యి ఇంజక్షన్లు అందాయని, ఆదివారం ఒక్క ఇంజక్షన్ కూడా అందలేదని ఆయన వివరించారు. స్పుత్నిక్ వి ఉత్పత్తి దేశంలో ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

Delhi likely to get Sputnik V Vaccine in June: Kejriwal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News