Sunday, April 28, 2024

సెల్ ధరలకు ఇక రెక్కలు ?

- Advertisement -
- Advertisement -

Two and a half percent duty on mobile parts

 

రెండున్నర శాతం దిగుమతి సుంకం

న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 202122 బడ్జెట్‌లో ఏవేవి భారం అవుతాయి? ఏవి చౌక అవుతాయనేది స్పష్టం అయింది.

ధరల పెరిగేవి ఇవే

ఎలక్ట్రానిక్ వస్తువులు….మొబైల్ , మొబైల్ చార్జర్లు, లెదర్ పాదరక్షలు, కాబూలీ చెనా శనిగలు

చౌకకానున్నవి

ఐరన్ స్టీల్, నైలాన్ బట్టలు రాగి వస్తువులు, ఇన్సూరెన్స్ , విద్యుత్ పరికరాలు , స్టీల్ వస్తువులు , జెమ్స్

సెల్‌వాలాలకు షాక్

దేశంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటున్న దశలో కేంద్ర బడ్జెట్‌తో దీనికి బ్రేకేసినట్లు అయింది. బడ్జెట్‌లో మొబైల్ విడిభాగాలపై రెండున్నర శాతం సుంకం విధిస్తున్నట్లు తెలిపారు. ఇక ఆయా వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని ఐదు నుంచి పదిశాతం పెంచుతున్నట్లు తెలిపారు. దీనితో ఫోన్లు, చార్జర్ల ధరలు 1 నుంచి రెండు శాతం పెరగవచ్చునని విశ్లేషకులు తెలిపారు. చార్జర్లపై సుంకాన్ని 15 నుంచి 30 శాతానికి పెంచారు, మొబైల్ తయారీలో వాడే ఇతర పరికరాలపై కూడా సుంకాన్ని పెంచారు. మొబైల్ ఫోన్లకు ఇస్తున్న 10 శాతం సర్వీసు వెల్ఫేర్ సెస్ మినహాయింపును ఈసారి రద్దు చేశారు. మొబైల్ ఫోన్లలో వాడే లిథియం అయాన్ బ్యాటరీల తయారికి అవసరం అయిన భాగాలపై ఇప్పటివరకూ ఎటువంటి పన్ను విధించలేదు. కానీ రెండున్న శాతం సుంకం విధిస్తున్నట్లు తెలిపారు.

దేశీయ ఫోన్లు ఎలక్ట్రానిక్ పరికరాలకు ప్రోత్సాహకాలు

దేశంలోనే ఫోన్లు , ఎలక్ట్రానిక్ పరికరాలు, సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించేందుకు బడ్జెట్ ప్రతిపాదనలు వెలువడ్డాయి. దీనికి సంబంధించి ఓ పథకాన్ని తీసుకువస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ ఉత్పత్తి వరుసలో భారత్‌ను కీలక భాగస్వామిగా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మేకిన్ ఇండియాలో భాగంగానే మొబైల్ ఫోను ఎలక్ట్రిక్ వాహనాలు, వాటి విడి భాగాలపై కస్టమ్స్ సుంకాలను తగు విధంగా పెంచినట్లు తెలిపారు.

స్వదేశీ తయారీ ప్రోత్సాహానికే

మొబైల్ భాగాలపై దిగుమతి సుంకంలో పెంపుదల నిర్ణయానికి స్థానిక ఉత్పత్తుల ప్రోత్సాహానికి దారితీస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. స్థానిక విలువల బలోపేతం దిశలో ఈ నిర్ణయం ఉంటుందన్నారు. సెల్ ఫోన్ల విడిభాగాలకు సంబంధించి ఇప్పటివరకూ ఉన్న 400 కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులపై పునః పరిశీలన జరుగుతుందని మంత్రి వివరించారు. కస్టమ్స్ డ్యూటీ విధానం చాలా సున్నితమైనదని, సంక్లిష్టమైనదని, ఇందులో రెండు ప్రధాన విషయాలు ప్రస్తావనకు వస్తాయని తెలిపారు. దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాల తగ్గింపు లేదా రద్దు లేదా హెచ్చింపులనేవి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం, భారత్‌ను గ్లోబల్ వాల్యూ చైన్ వరుసలో నిలపడం అనే లక్షాల దిశలో ఈ సుంకాల నిర్ణయం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పుడు ప్రింటెడ్ సర్కూట్ బోర్డు అసెంబ్లీ (పిసిబిఎ) లేదా సాధారణంగా పిలిచే మదర్‌బోర్డుపై రెండున్నర శాతం కస్టమ్స్ సుంకం పెంపుదలను ప్రతిపాదించారు.

ఇది పద్దతి కాదు ః పంకజ్

ఇప్పటివరకూ ఉన్న పన్నులు సుంకాల మినహాయింపులు ఇకపై కూడా మొబైల్, ఎలక్ట్రానిక్ రంగానికి కొనసాగితే బాగుంటుందని సంబంధిత సంఘం ఛైర్మన్ పంకజ్ మోహింద్రూ స్పందించారు. సున్నా దిగుమతి సుంకం ఇప్పటివరకూ వీటికి వర్తిస్తూ వచ్చింది. అయితే దీనిని తొలిగించడం మంచిది కాదని పంకజ్ చెప్పారు. జీరో కస్టమ్స్ డ్యూటీ అంటే పన్నులు లేకుండా ఉండటం కాదని, ముడిభాగాలపై 18 శాతం జిఎస్‌టి ఉండనే ఉంటుందని, ఇతరత్రా భారం కూడా పడుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News