Tuesday, November 28, 2023

పెళ్లికి అనుమతి కోరుతూ ఒక జంట.. పెళ్లి నమోదుకై మరో జంట పిటిషన్

- Advertisement -
- Advertisement -

Two couples of same sex petition in High Court to allow their Marriage

 

రెండు జంటలూ ఒకే సెక్స్ వారే

న్యూఢిల్లీ : ఒకే సెక్స్‌కు చెందిన రెండు జంటలు తమ వివాహానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రత్యేక వివాహ చట్టం(ఎస్‌ఎంఎ) కింద తమ వివాహానికి అనుమతించాలని ఇద్దరు మహిళలు, అమెరికాలో జరిగిన తమ వివాహాన్ని విదేశీ వివాహ చట్టం(ఎఫ్‌ఎంఎ) కింద నమోదు చేయాలని ఇద్దరు పురుషులు దాఖలు చేసిన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వ సమాధానాన్ని కోరుతూ ఢిల్లీ హైకోర్టు బుధవారం నోటీసులు జారీచేసింది.

ఎస్‌ఎంఎ కింద వివాహం చేసుకోవడానికి అనుమతిని కోరుతూ ఇద్దరు మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌పై వైఖరి తెలియచేయాలని కోరుతూ కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. అదే విధంగా అమెరికాలో వివాహం చేసుకున్న ఇద్దరు పురుషులు ఎఫ్‌ఎంఎ కింద తమ వివాహాన్ని నమోదు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రానికి, న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్‌కు కోర్టు నోటీసులు జారీచేసింది. ఈ కేసుల తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 8వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News