Tuesday, May 14, 2024

కరోనా వ్యాధి నిరోధక శక్తి కొన్ని నెలలు ఖాయం

- Advertisement -
- Advertisement -

Immunity against COVID-19 may last for Five months

 

ఆరిజోనా యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనం వెల్లడి

వాషింగ్టన్ : సార్స్ కొవి 2 వైరస్ సోకిన తరువాత కొవిడ్ 19కు వ్యతిరేకంగా వ్యాధినిరోధక శక్తి కనీసం ఐదు నెలలైనా విడువకుండా ఉంటుందని భారతీయ సంతతి పరిశోధకుని ఆధ్వర్యాన సాగిన అధ్యయనం వెల్లడించింది. ఆరిజోనా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. నోవెల్ కరోనా వైరస్ సోకిన దాదాపు 6000 మందిలో ఉత్పత్తయిన యాంటీబాడీల నుంచి సేకరించిన నమూనాను వీరు అధ్యయనం చేశారు. సార్స్ కొవి2 సోకిన తరువాత ఐదు నుంచి ఏడు నెలల వరకు ఎక్కువ నాణ్యమైన యాంటీబాడీలు ఇంకా ఉత్పత్తి అవుతూ ఉండడాన్ని తాము స్పష్టంగా కనుగొన్నామని ఆరిజోనా యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ దీప్తా భట్టాచార్య చెప్పారు. కొవిడ్ 19 కు వ్యతిరేకంగా వ్యాధి నిరోధక శక్తి ఉండదని చాలామంది అంటున్నారని దానిపై పరిశోధించడానికి తాము ఈ అధ్యయనం చేపట్టి కనీసం ఐదు నెలల పాటైనా వ్యాధి నిరోధక శక్తి ఉంటుందని కనుగొన గలిగామని ప్రొఫెసర్ జాంకో నికోలిచ్‌జ్యుగిచ్ వివరించారు.

వైరస్ మొదట కణాలకు సోక గానే వ్యాధి నిరోధక వ్యవస్థ స్వల్పకాలం జీవించే ప్లాస్మా కణాలను నిలుపుతుందని, అవి వెంటనే వైరస్‌తో పోరాడడానికి యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయని పరిశోధకులు వివరించారు. వైరస్ సంక్రమించిన 14 రోజుల్లోనే రక్త పరీక్షల ద్వారా ఆ యాంటీబాడీలు కనిపిస్తాయని వారు చెప్పారు. వ్యాధి నిరోధక స్పందన రెండవ దశ అంటే సుదీర్ఘకాలం జీవించే ప్లాస్మా కణాలను సృష్టించడమేనని, ఇవి ఎక్కువ నాణ్యమైన యాంటీబాడీలుగా వ్యాధినిరోధక శక్తిని కలిగి ఉంటాయని పేర్కొన్నారు. సార్స్ కొవి 2 కు వ్యతిరేకంగా యాంటీబాడీలు ఎంతసమర్థంగా రక్షణ కలిగిస్తాయి? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమని, యు ఆరిజోనా హెల్తు సైన్సెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు మైకేయి డి డేక్ అన్నారు. ఈ పరిశోధన ఆ మేరకు యాంటీబాడీలను కచ్చితంగా పరీక్షించే సామర్థం ఇవ్వడమే కాక, వ్యాధినిరోధక వ్యవస్థ కొనసాగుతుందన్న వాస్తవాన్ని తెలుసుకునే పరిజ్ఞానాన్ని కూడా ఇచ్చినట్టు చెప్పారు. చాలా వరకు సార్స్‌కొవి2 లా పోలి ఉన్న మొదటి సార్స్ కరోనా వైరస్‌కు ఎవరైతే బాధితులు అయ్యారో అది సోకిన తరువాత 17 ఏళ్ల వరకు కూడా వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉన్నారని వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News