Thursday, May 2, 2024

సిఎం కెసిఆర్‌కు ప్రధాని మోడి ఫోన్

- Advertisement -
- Advertisement -

Prime Minister Modi phone to CM KCR

 

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో భారీ వర్షాలు కారణంగా ఏర్పడిన వరదల పరిస్థితిపై ప్రధాని మోడి ఆరా తీశారు. బుధవారం సిఎం కెసిఆర్‌కు ఆయన ఫోన్ చేసి అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేగాక ఏపిలో వర్షభావ పరిస్థితిపై కూడా అక్కడి సిఎం జగన్‌కు ఫోన్ చేసినట్లు మోడి ట్వీట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా వర్ష బీభత్సానికి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఎంత నష్టం జరిగిందనే విషయాన్ని కూడా అంచనా వేయలేని పరిస్థితి ఉంది.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ప్రధాని మోడీ భరోసానిచ్చారు. ఈ క్రమంలో “సిఎం కెసిఆర్, ఏపి ముఖ్యమంత్రి జగన్‌తో నేను మాట్లాడాను అని, వర్ష బాధితుల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నానని” మోడీ ట్వీట్ చేశారు. అంతేగాక రాష్ట్రంలో భారీ వర్షపాత పరిస్థితులను కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిశితంగా పరిశీలిస్తుందని కేంద్ర హోం మంత్రి సైతం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వర్షప్రభావిత ప్రాంతాలకు సహాయ, సహకారాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వర్షాల కారణంగా నష్టపోయిన బాధితుల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నానని ఆయన ట్విట్టర్‌లో వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News