Tuesday, April 30, 2024

కరోనా చికిత్స తర్వాత సూపర్‌మ్యాన్‌లా మారిపోయా: ట్రంప్

- Advertisement -
- Advertisement -

Trump says he feels like Superman after coronavirus treatment

 

వాషింగ్టన్: కరోనా వైరస్‌కు చికిత్స పొందిన తర్వాత తనను తాను సూపర్‌మ్యాన్‌గా భావిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. చికిత్స తర్వాత కరోనా వైరస్‌ను తట్టుకునే రోగ నిరోధక శక్తి తనలో రెట్టింపయ్యిందని ఆయన చెప్పారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న తర్వాత రెండవ ఎన్నికల ర్యాలీని ఆయన మంగళవారం పెన్సిల్వేనియా రాష్ట్రం జాన్స్‌టౌన్‌లో నిర్వహించారు. విమానాశ్రయం టర్మాక్‌లో వందలాది మంది తన మద్దతుదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ చికిత్స తర్వాత తాను సూపర్‌మ్యాన్‌గా ఫీల్ అవుతున్నానని చెప్పారు. తనకు చికిత్స అందచేసిన డాక్టర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనకు అందచేసిన డ్రగ్స్ ఏమిటో తనకు తెలియదని, అవి ఏవైనప్పటికీ అవి తనలో రోగనిరోధక శక్తిని పెంచాయని ఆయన చెప్పారు. అవి వాడిన తర్వాత తాను సూపర్‌మ్యాన్‌లాగా భావిస్తున్నానని ట్రంప్ చెప్పారు. ఇప్పడు ఇక్కడ హాజరైన అందరినీ ముద్దు పెట్టే శక్తి తనలో ఉందని ఆయన చమత్కరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News