Friday, May 3, 2024

అప్రమత్తం

- Advertisement -
- Advertisement -

Two days of heavy rain across Telangana

 

ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించండి

ప్రాణం నష్టం జరగకుండా జాగ్రత్త

చర్యలు అధికారులకు సిఎం కెసిఆర్

ఆదేశం కలెక్టర్లను అప్రమత్తం చేసిన సిఎస్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను, ప్రజలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కోరారు. రాష్ట్రంలో చాలా చోట్ల ఆదివారం సైతం వర్షాలు పడ్డాయన్నారు. కాగా సోమ, మంగళ వారాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిందన్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సిఎం కెసిఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలు, పోలీస్ కమీషనర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఎం కోరారు.

అధికారులంతా ఎక్కడివారు అక్కడే ఉండి పరిస్థితిని గమనిస్తుండాలన్నారు. అలాగే అవసరమైన సహాయ చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సిఎం కెసిఆర్ కోరారు. భారీ వర్షాలు, వాటితో పాటు పెద్దఎత్తున వరదలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సిఎం విజ్ఞప్తి చేశారు. వర్షాల కారణంగా రాష్ట్రంలో ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా ముందస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. వర్షాల పరిస్థితిని బట్టి స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా సంబంధిత అధికారులను తగు చర్యలు తీసుకోవాలని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

కలెక్టర్లను, ఎస్‌పిలను అప్రమత్తం చేసిన సిఎస్

రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ సూచనల నేపధ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలను అప్రమత్తం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిందన్నారు. దీంతో లోతట్టు ప్రాంతాలలో నీటి ప్రవాహం, నీరు నిలిచే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. భారీ వర్షాలతో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడి ఆస్తి, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నందున అధికారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

ప్రాజెక్ట్ లు, రిజర్వాయర్‌లు ఓవర్‌ఫ్ల్లో వలన లోతట్టు ప్రాంతాల్లో జలమయం అయ్యే అవకాశం ఉందని ఆయా ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. కలెక్టర్లు, ఎస్‌పిలు, జిల్లా ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండి ప్లడ్ ప్రోటోకాల్ ను పాటించి తగు సూచనలు, సలహాలు చేయాలన్నారు. అలాగే లో లెవల్ బ్రిడ్జ్, కాజ్ వే లపై ప్రత్యేక దృష్టి సారించాలని, పాదచారులు నడవకుండా నిషేధం చేయాలన్నారు. వర్షాల కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం సంభవించకుండా చర్యలు చేపట్టాలని ప్రధాన కార్యదర్శి తెలిపారు. భారీ వర్షాలతో అవాంఛనీయ ఘటనలు జరిగితే ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయాలని సిఎస్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News