Thursday, August 7, 2025

అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన కారు..ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

మండలంలోని చిన్నగొట్టిముక్కుల శివారులోని చాకరిమెట్ల ఆలయ సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు, శివ్వంపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రానికి చెందిన కొడకంచి బాలమణి (70)కి ముగ్గురు కుమారులు. చిన్న కొడుకు నర్సింహా గౌడ్ నర్సాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. అతని కారులో బాలమణి నర్సాపూర్ కు బయలుదేరారు.

నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ఉప్పల ఆంజనేయులు (27) కారు నడుపుతుండగా, అది వేగంగా చాకరిమెట్ల సమీపంలోకి రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బలంగా చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో  బలమైన గాయాలు కావడంతో కారులో ప్రయాణిస్తున్న కొడకంచి బాలమణి, ఉప్పల ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌ఐ మధుకర్ రెడ్డి తన సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News