Thursday, May 2, 2024

ఇద్దరు అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల ః రూ.లు కోటి ఇరవై లక్షల వరకు సైబర్ మోసాలు చేసిన ఇద్దరు అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసినట్లు సిరిసిల్ల ఎస్‌పి అఖిల్ మహజన్ ఆదివారం సిరిసిల్లలో వెల్లడించారు. సైబర్ నేరగాళ్లయిన శ్రీకాకుళం జిల్లా రాజమండ్రి రూరల్ మండలం రాజానగరంకు చెందిన సాలది రామ్‌గోపాల్ (53) అమాయక ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదించాలనే దురాశతో ఉద్యోగాల పేరిట పేపర్ ప్రకటనలు ఇచ్చి ఫేక్ మెయిల్ ఐడి ద్వారా ఉద్యోగం కావాలనుకునే వారి నుండి రూ. 50 వేల రూపాయలు చొప్పును వసూలు చేసేవాడన్నారు. రామ్‌గోపాల్ తన నేరాలు బయట పడకుండా ఉండాలని విషయమంతా గంగవరం మండలం నెల్లిపూడికి చెందిన కొరుమెల్లి రాజ్‌కుమార్ అనే సిమ్ రిటైలర్‌కు తెలిపి అతని దగ్గర అధిక ధరలకు సిమ్‌లను కొనుగోలు చేసి ఆక్టివేట్ చేయించుకునేవాడన్నారు.

నిందితుడైన సాలది రామ్‌గోపాల్‌పై దేశవ్యాప్తంగా 1351 ఫిర్యాదులు, తెలంగాణలో 257 ఫిర్యాదులు నమోదవగా దేశవ్యాప్తంగా 65 కేసులు నమోదయ్యాయన్నారు. గతంలో 12 కేసుల్లో జైలుకు కూడా వెళ్లివచ్చాడన్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన అజ్మీర సునిత అనే నిరుద్యోగిని మోసం చేసి ఆమె నుండి రూ.లు 2,85,000లు స్వాహ చేశారన్నారు. రామ్‌గోపాల్ విషయమై సునీత పోలీసులకు ఫిర్యాదు చేయగా,పోలీసులు తూర్పుగోదావరి జిల్లాలో విచారణ చేస్తుండగా నిందితులు పోలీసుల నుండి తప్పించుకుని తిరుగుతూ వేములవాడకు చేరుకోగా సాంకేతికత పోలీసులు వారిని అరెస్ట్ చేసి వారి వద్ద ఒక లక్షా అరవైవేల రూపాయల నగదు, ఒక మారుతి సుజుకి, సియాజ్ కారు, 7 సిమ్ కార్డులు, 3 మొబైల్ ఫోన్లు, 4 ఏటిఎవ కార్డులు, 163 సిమ్ కార్డులు, చెక్ బుక్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News