Sunday, April 28, 2024

2021 నోబెల్ శాంతి బహుమతి ఇద్దరు జర్నలిస్టులకు…

- Advertisement -
- Advertisement -
Nobel Peace Prize

మరియా రెసా(ఫిలిప్పీన్స్), దిమిత్రి మురాతోవ్(రష్యా)
భావస్వేచ్ఛ కోసం కృషిచేసినందుకుగాను…

స్టాక్‌హోం(స్వీడెన్): ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి ఇద్దరు పాత్రికేయులను వరించింది. ప్రజాస్వామ్యానికి వెన్నుదన్నుగా ఉండే భావస్వేచ కోసం పాటుపడినందుకుగాను జర్నలిస్టులైన మరియా రెసా(ఫిలిప్పీన్స్), దిమిత్రి మురాతోవ్(రష్యా)లకు ఈ పురస్కారాన్ని నార్వేజియన్ నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది.

రష్యాలో ప్రతికూల పరిస్థితిలో దిమిత్రి మురతోవ్ భావస్వేచ పరిరక్షణ కోసం పోరాడారు. 1993లో స్థాపించిన స్వతంత్ర దినపత్రిక ‘నొవజా గెజెటా’ వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు. వాస్తవికత, వృత్తి సమగ్రతకు కట్టుబడి పనిచేసే దినపత్రికగా దానికి పేరుంది. సెన్సార్ చేసిన విషయాలను రష్యాలో చాలా అరుదుగా వెలువరిస్తుంటారు. నొవజా గెజెటాకు చెందిన ఆరుమంది పాత్రికేయులు చంపబడ్డప్పటికీ, దాని ప్రధాన సంపాదకుడు దిమిత్రి మురతోవ్ దానిని మూసేసేందుకు నిరాకరించారు. ఆయన నిరంతరం పాత్రికేయుల హక్కుల కోసం ఉద్యమించారని నోబెల్ కమిటీ తన ప్రకటనలో పేర్కొంది.

ఫిలిప్పీన్స్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్టు మరియా రెసా. తన దేశంలో పెరిగిపోతున్న అధికార దుర్వినియోగం, హింసను తన కలంతో ఆమె ప్రపంచానికి తెలిపారు. పరిశోధనాత్మక పాత్రికేయతకుగాను 2012లో ఆమె ‘రాప్లర్’ పేరుతో ఓ డిజిటల్ మీడియా కంపెనీని స్థాపించారు. ఓ పాత్రికేయురాలిగా, సిఇఒగా రెసా ఎన్నో సంచలనాత్మక కథనాలు ప్రచురించారు. అధికారుల నుంచి ఒత్తిళ్లను కూడా ఎదుర్కొన్నారు. నిరంతరం భావస్వేచ్ఛ కోసం తన దేశంలో పోరాడుతున్నారు.
ఈ ఇద్దరు పాత్రికేయులకు స్వర్ణ పతకం, 10 మిలియన్ల స్వీడిష్ క్రోనర్ల బహుమతి అందాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News