Tuesday, December 6, 2022

కుంటాల జలపాతానికి వెళ్తుండగా టాటాఎస్‌పై పడిన చెట్టు: ఇద్దరు మృతి

- Advertisement -

నిర్మల్: గ్రామంలో ఉన్న స్నేహితులతో కలిసి కుంటాల జలపాతం అందాలు వీక్షించేందకు టాటా ఎస్‌లో వెళ్తుండగా వారి వాహనంపై చెట్టు పడడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో బుచ్చిరాజం(45), రవి(35) తన 12 మంది స్నేహితులతో కలిసి కుంటాల జలపాతం అందాలను వీక్షించేందుకు వెళ్తున్నారు. ఖానాపూర్ శివారులో టాటాఎస్ వెళ్తుండగా వారి వాహనంపై చెట్టు కూలిపోయింది. చెట్టు వాహనం ముందుభాగంలో పడిపోవడంతో డ్రైవర్ సీట్లో కూర్చున్న బుజ్జిబాబు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. వాహనంలో ఉన్న వారి సమాచారం మేరకు పోలీసులు పొక్లెయిన్‌తో అక్కడికి చేరుకొని వాహనంలో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. రవిని అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. నిఖిల్‌ను కూడా ఆస్పత్రికి తరలించారు. నిఖిల్ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Latest Articles