Saturday, May 18, 2024

బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్

- Advertisement -
- Advertisement -

‘బలగం’ వంటి సినిమాతో సరికొత్త చరిత్రను సృష్టించిన నిర్మాణ సంస్థ దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి వస్తోన్న మరో చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. ప్రముఖ కొరియోగ్రాఫర్ యష్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. మలయాళ నటి కార్తీక మురళీధరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘ఆకాశం దాటి వస్తావా’ చిత్రంతో శశి కుమార్ ముతులూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇదొక మ్యూజికల్ డాన్స్ బేస్డ్ లవ్ స్టోరి.

తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ‘ఉన్నానో లేనో..’ అనే బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ తన అద్బుతమైన గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. హీరో హీరోయిన్ల మధ్య కనిపిస్తోన్న బ్యూటీఫుల్ కెమిస్ట్రీ.. మ్యాజికల్ సాంగ్‌కి తగినట్లు వారిద్దరూ డాన్స్ చేసే తీరు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News