Saturday, April 27, 2024

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్: భారీగా తగ్గనున్న రైల్ టికెట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఏసీ ఛైర్‌కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధరలపై రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా తరగతులు కలిగిన అన్ని రైళ్లలో టికెట్ ధరపై 25 శాతం వరకు డిస్కౌంట్ ఇచ్చేందుకు నిర్ణయించింది. వందే భారత్ సహా అనుభూతి , విస్టాడోమ్ కోచ్‌లు కలిగిన రైళ్లకూ ఇది వర్తిస్తుంది. ఆక్యుపెన్సీ ఆధారంగా టికెట్ ధరలపై ఈ డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ఆక్యుపెన్సీ పెంచే లక్షంతో రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. టికెట్ ధరలను నిర్ణయించే అధికారం ఆయా రైల్వేజోన్లలో ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌కు అప్పగించింది.

దేశ వ్యాప్తంగా వందే భారత్ రైళ్లు విరివిగా అందుబాటు లోకి వస్తున్నాయి. కొన్ని రూట్లలో ఆదరణ బాగానే ఉన్నప్పటికీ, మరికొన్ని రూట్లలో మాత్రం టికెట్ ధరలు అధికంగా ఉన్న కారణంగా ఆక్యుపెన్సీ తక్కువగా ఉంటోంది. దీనికి తోడు ఎండలు తగ్గి వర్షాలు కూడా పడుతుండడంతో ఏసీ బోగీల్లో ,ముఖ్యంగా ఛైర్‌కార్లలో ప్రయాణానికి ఆశించిన మేర ప్రయాణికుల నుంచి డిమాండ్ ఉండక పోవచ్చు. ఈ నేపథ్యంలో రైల్వేబోర్డు కొత్త పథకంతో ముందుకొచ్చింది. అనుభూతి, విస్టాడోమ్ కోచ్‌లు కలిగిన రైళ్లు సహా ఏసీ ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ తరగతులు కలిగిన అన్ని రైళ్లకూ ఈ స్కీమ్ వర్తిస్తుందని రైల్వే బోర్డు తెలిపింది.

డిస్కౌంట్ అనేది బేసిక్ ఫేర్‌లో గరిష్ఠంగా 25 శాతం వరకు ఇవ్వనున్నారు. రిజర్వేషన్, సూపర్ ఫాస్ట్ సర్‌ఛార్జి, జీఎస్టీ వంటి ఇతర ఛార్జీలు మాత్రం అదనంగా వర్తిస్తాయి. గడిచిన 30 రోజుల్లో 50 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీ కలిగిన రైళ్లను పరిగణన లోకి తీసుకోవచ్చని పేర్కొంది. డిస్కౌంట్ నిర్ణయించే ముందు ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలను సైతం పరిగణన లోకి తీసుకోనున్నారు. ఆక్యుపెన్సీని బట్టి రైలు ప్రయాణించే మొత్తం దూరానికి, లేదా ఎంపిక చేసిన స్టేషన్ల మధ్య కూడా ప్రయాణానికి డిస్కౌంట్ వర్తింప చేయొచ్చని తెలియజేసింది. డిస్కౌంట్ నిర్ణయం తక్షణమే అమలు లోకి వస్తుందని , ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి ఇది వర్తించదని తెలియజేసింది. హాలీడే, ఫెస్టివల్ స్పెషల్ రైళ్లకు ఈ స్కీమ్ వర్తించదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News