Thursday, May 2, 2024

నారపల్లి టూ ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి మోడీ ప్రభుత్వం సహకరించడంలేదు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: నారపల్లి నుంచి ఉప్పల్ వరకు రహదారి నిర్మాణంతో పాటు ఫ్లైఓవర్ పూర్తి అయితే ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఉప్పల్‌లో స్కైవాక్ టవర్‌ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వం నిర్లక్షం చేయడంతో నాలుగేళ్ల నుంచి రహదారి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని దుయ్యబట్టారు. నారపల్లి – ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం సహకరించడంలేదని మండిపడ్డారు. వేసవి కాలంలో నీటి ఇబ్బందులు లేకుండా సిఎం కెసిఆర్ పరిష్కరించారని ప్రశంసించారు.  సిఎం కెసిఆర్‌ను ఎందుకు జైల్లో పెట్టాలో బిజెపి నాయకులు చెప్పాలని కెటిఆర్ నిలదీశారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, కెసిఆర్ కిట్లు, డబుల్ బెడ్ రూములు ఇస్తున్నందుకా? అని ప్రశ్నించారు. శిల్పారామంలో పది కోట్ల రూపాయలతో మల్టీపర్సస్ భవనం ప్రారంభించుకున్నామన్నారు. హైదరాబాద్ మహానగరంలో ఇప్పటివరకు 35 ఫైఓవర్లు నిర్మించుకున్నామని తెలిపారు. ఉప్పల్ అన్ని డివిజన్లలో మల్టీ పర్సస్ ఫంక్షన్ హాళ్లు నిర్మిస్తామన్నారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, బిజెపి దేశానికి ఏం చేసిందని కెటిఆర్ ప్రశ్నించారు.

Also Read: అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్: కెటిఆర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News