Saturday, April 27, 2024

“కచోరీల అమ్మ”కు వందనం !

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: గుండె ధైర్యంతో ఎటువంటి కష్టాలనైనా ఎదురీదవచ్చని నిరూపించిందో మహిళ. ఐదేళ్ల క్రితం భర్త వినోద్ వర్మ గుండెపోటుతో చనిపోవడంతో ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడిని పెంచే బరువుబాధ్యతలు ఆ ఆ మహిళపై పడ్డాయి. అయినా ఆమె గుండె ధైర్యం సడలలేదు. వారి జీవితాలకో దారిచూపాల్సిన బాధ్యతను 60 ఏళ్ల వద్ధురాలైన అంజూ వర్మ ఆత్మస్థైర్యంతో స్వీకరించింది.

ఉత్తర్ ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో నివసించే అంజూ వర్మ దినచర్య రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూసివేసిన దుకాణాల ముందు ప్లాట్‌ఫామ్ ముందు కచోరీలు తయారుచేయడం ముదలుపెడుతుంది. అమ్మ చేసే ఆలు, సోయాబీన్ తదితర మసాలాలు కూరిన వేడివేడి కచోరీలు తినడానికి స్థానికులు క్యూకడతారు. ప్లేటు కచోరీలు కేవలం రూ. 30కే అమ్ముతున్న అంజూ వర్మ అక్కడకు వచ్చే కస్టమర్లకు కచోరీల అమ్మగా పాపులర్ అయిపోయింది.

కచోరీలు అమ్మకం ద్వారా రోజుకు రూ. 2,000 ఆదాయం లభిస్తుందని ఆమె తెలిపారు. అద్దెకు దుకాణాన్ని తీసుకునే స్తోమత లేనందునే తాను రాత్రి వేళల్లో మూసి ఉన్న దుకాణాల ఎదుట కచోరీలు తయారుచేసి అమ్ముతున్నట్లు ఆమె చెప్పారు. ముగ్గురు కుమార్తెలలో ఒకమ్మాయి పెళ్లి చేశానని, 20 ఏళ్ల వయుసున్న ఆఖరు అమ్మాయి కాలేజీలో చదువుకుంటోందని ఆమె తెలిపారు. తెల్లవారుజామున 3 గంటలకు దుకాణం కట్టేసి ఇంటికి వెళ్లి నిద్రపోతానని, మధ్యాహ్నం లేచి కూరగాయలు కొని, పిండి తయారుచేసుకుని రాత్రి 10 గంటలకు మళ్లీ దుకాణం ముందుకు చేరుకుంటానని ఆమె వివరించారు.

ఒక వృద్ధురాలు అయి ఉండి తన పిల్లలను పోషించడానికి కష్టపడుతున్న కచోరీల అమ్మకు పోలీసులు కూడా అండదండలు అందిస్తున్నారు. ఆమెకు రక్షణగాఆ ఉండాలని పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు జారీచేసినట్లు జిల్లా ఎస్‌పి ఎస్ ఆనంద్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News