Tuesday, May 14, 2024

యూపిఎస్‌సి ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: 2023 సివిల్స్ ప్రిలిమనరీ పరీక్షలో మొత్తం 14,624 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపిఎస్‌సి) సోమవారం ఈ ఫలితాలను విడుదల చేసింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్), ఇండియన్ ఫారెన్‌సర్వీస్ (ఐఎఫ్‌ఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్) అనే అధికారుల ఎంపిక కోసం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఏటా ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వూ అనే మూడు దశల్లో జరుగుతుంది. 2023 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మే 28న నిర్వహించారు. అభ్యర్థుల సీరియల్ నెంబర్లు, రోల్‌నెంబర్లు, పేర్లు యుపిఎస్‌సి వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. దీని ప్రకారం ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలో మొత్తం 14,624 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 15న జరిగే మెయిన్స్ పరీక్షకు హాజరయ్యేందుకు వీరు అర్హత సాధించారు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష కోసం ఇప్పుడు మళ్లీ డిటైల్డ్ అప్లికేషన్ ఫామ్ 1 (డిఎఎఫ్ 1)లో దరఖాస్తు చేసుకోవాలని యూపిఎస్‌సి తెలియజేసింది.

ఈమేరకు చివరి తేదీని త్వరలోనే కమిషన్ వెల్లడించనున్నది. ప్రిలిమ్స్ కటాఫ్, ఆన్సర్ కీని సివిల్ సర్వీసెస్ పరీక్ష మొత్తం ప్రక్రియ పూర్తయిన తరువాత వెల్లడించనున్నట్టు యూపిఎస్‌సి తెలియజేసింది. ఈమేరకు పూర్తి సమాచారం తెలియజేయడానికి న్యూఢిల్లీ షాజహాన్ రోడ్ లోని థోల్‌పూర్ హౌస్ ఆవరణ లోని పరీక్షహాలు సమీపాన సమాచార కౌంటర్ ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తమ పలితాల వివరాలు, ఇతర సమాచారం పొందడానికి అన్ని పనిదినాల్లో ఉదయం 10 గం నుంచి సాయంత్రం 5 గం. లోగా కౌంటర్ లోని టెలిఫోన్ నెంబర్లు 011.23385271, 01123098543లేదా 01123381125, లకు కాల్ చేసి పొందవచ్చునని యూపిఎస్‌సి తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News