Thursday, May 2, 2024

అఫ్ఘాన్‌లో శాంతి

- Advertisement -
- Advertisement -

US deal with Taliban

 

తాలిబన్లతో అమెరికా ఒప్పందం

18ఏళ్ల అశాంతికి తెర
క్రమంగా దళాలను ఉపసంహరించుకోనున్న అమెరికా
14నెలల్లో పూర్తిగా వైదొలగనున్న అగ్రరాజ్యం
అఫ్ఘాన్ వ్యవహారాల్లో ఇకముందు విదేశీ జోక్యం ఉండదని హామీ ఇవ్వడం హర్షదాయకం : తాలిబన్లు

శనివారం నాడు దోహా(కతర్)లో అమెరికా అధికారులు, తాలిబన్లు శాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన తర్వాత అమెరికా శాంతి రాయబారి జెల్మే ఖలీల్‌జాద్, తాలిబన్ల రాజకీయ అగ్రనేత ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ కరచాలనం

దోహా: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లపై అమెరికా 18 ఏళ్లుగా సాగిస్తున్న పోరాటానికి తెరపడింది. అమెరికా, అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ల మధ్య శనివారం ఖతర్ రాజధాని దోహాలో ఈ మేరకు శాంతి ఒ ప్పందం కుదిరింది. పలుమార్లు చర్చల అనంతర ం అమెరికా, తాలిబన్ ప్రతినిధులు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. తాజా ఒప్పందంతో అఫ్గానిస్థాన్‌నుంచి వేలాది అమెరికా బలగాలు వైదొలగుతాయి. ఫలితంగా 18 ఏళ్లుగా అఫ్గాన్‌లో తాలిబన్లతో సాగుతున్న పోరుకు తెరపడుతుంది. అయితే అమెరికాతాలిబన్ల మధ్య శాంతి ఒప్పందానికి అఫ్గానిస్థాన్ దూరంగా ఉండడం విశేషం. పాకిస్థాన్, ఖతర్, భారత్, టర్కీ, ఇండోనేషియా, ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్ దేశాలకు చెందిన ప్రతినిధుల సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ఒప్పందంపై అఫ్గాన్ సయోధ్యపై అమెరికా ప్రత్యేక ప్రతినిధి జల్మయ్ ఖలీలాజాద్, తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బర్దార్ సంతకాలు చేశారు.

ఈ ఒప్పందం ఫలితంగా అఫ్గానిస్థాన్ గడ్డపైనుంచి అమెరికా బలగాలు క్రమంగా వైదొలుగుతాయి. తొలి విడతగా 135 రోజుల్లోగా అఫ్గాన్‌లోని అమెరికా బలగాలను ఇప్పుడున్న 13,000 నుంచి 8,600కు తగ్గిస్తారు. మిగతా బలగాలను 14 నెలల్లోగా ఉపసంహరిస్తారు. అయితే ఉగ్రవాద నిరోధానికి తాలిబన్లు ఇచ్చిన హామీలకు ఏ మేరకు కట్టుబడి ఉంటారనే దానిపై అఫ్గాన్‌నుంచి అమెరికా బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవడం ఆధారపడి ఉంటుంది. దోహాలో జరిగిన ఈ కార్యక్రమానికి అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా హాజరయ్యారు. 2011 సెప్టెంబర్ 11న న్యూయార్క్‌లోని ట్రేడ్‌సెంటర్‌పై అల్‌ఖైదా జరిపిన దాడికి ప్రతిగా అప్పటి అధ్యక్షుడు జార్జి డబ్లు బుష్ అఫ్గాన్‌పై దాడికి ఆదేశించిన విషయం తెలిసిందే. కొద్ది నెలల్లోనే అక్కడి తాలిబన్ ప్రభుత్వం కుప్పకూలడం, ఒసామా బిన్ లాడెన్ సహా అల్‌ఖైదా అగ్రనేతలంతా పాకిస్థాన్‌కు పారిపోవడం జరిగింది. అయితే అక్కడ యుద్ధం మాత్రం ఆగలేదు.

అఫ్గాన్‌లో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అమెరికా జరిపిన ప్రయత్నాల్లో అమెరికా సైనికులతో పాటు ఇరుపక్షాల్లో ఎన్నో వేల మంది అసువులు బాసారు కూడా. ఇప్పటికీ అక్కడ అడపా దడపా జరుగుతున్న దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అఫ్గాన్‌లో యుద్ధం కోసం అమెరికా ఖర్చు చేసిన సొమ్ము750 బిలియన్ డాలర్ల పైమాటే.

తాలిబన్ల విక్టరీ ర్యాలీ
ఒప్పందంపై సంతకాలు జరగడానికి ముందు కొన్ని వందల మంది తాలిబన్లు దోహాలో విక్టరీ ర్యాలీ నిర్వహించారని, ఈ ర్యాలీలో పాల్గొన్న వారు తాలిబన్ గ్రూపునకు చెందిన తెల్లజెండాలను ప్రదర్శించినదృశ్యాలు తాలిబన్ వెబ్‌సైట్లలో ఉంచిన వీడియోల్లో కనిపించింది.‘ ఈ రోజు మనకు విజయ దినోత్సవం. అల్లా దయవల్ల ఇది జరిగింది’ అని చర్చల్లో పాలుపంచుకున్న తాలిబన్ నేతల్లో ఒకరైనఅబ్బాస్ స్టానిక్‌జాయ్ ర్యాలీనుద్దేశించి మాట్లాడుతూ అన్నారు. మధ్యప్రాచ్యంలో అంతులేకుండా సాగిస్తున్న యుద్ధాలనుంచి అమెరికాకు విముక్తి కలిగిస్తానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నో సార్లు ప్రకటించిన విషయం తెలిసిందే, తాలిబన్‌లతో శాంతి ఒప్ప విషయంలో ఆయన అత్యంత జాగ్రత్తగా అడుగులేస్తూ వచ్చారు కూడా. అమెరికా, లేదా దాని మిత్రదేశాలపై దాడులు చేయడానికి ఉగ్రవాదులు అఫ్గాన్‌ను ఒక వేదికగా చేసుకోవడానికి అనుమతించమని ఈ ఒప్పందంలో తాలిబన్లు హామీ ఇచ్చారు.

అయితే తమ హామీలను తాలిబన్లు అమలు చేయడంపై అమెరికా అధికారులు పూర్తి నమ్మకంతో లేరు. అంతేకాదు ఈ ఒప్పందం కింద అఫ్గాన్ జైళ్లనుంచి 5,000కు పైగా తాలిబన్లను విడుదల చేయాల్సి ఉంటుంది. అఫ్గాన్ ప్రభుత్వం ఈ పని చేస్తుందా లేదా అనేది కూడా సందిగ్ధమే. అన్నిటికన్నా మించి తాలిబన్ మిలిటెంట్ల్లు తమ నేతల మాటలను మన్నించి ఆయుధాలను వదిలిపెడతారా అనేది కూడా అనుమానమే. అయితే అఫ్గాన్‌లో శాంతి దిశగా ఓ అడుగు పడిందనేది మాత్రం నిజం. ఈ ఏడాది చివర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండడం. మరో సారి అధ్యక్ష పదవికి పోటీ చేయాలని అనుకొంటున్న ట్రంప్ ఈ ఒప్పందాన్ని ఓ తురును ముక్కగా వాడుకుంటారనేది మాత్రం నిజం.

US deal with Taliban
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News