Home తాజా వార్తలు యాదాద్రి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు..

యాదాద్రి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు..

యాదాద్రి: యాదాద్రి లక్ష్మీ నారసింహస్వామి ఆలయంలో కన్నులపండుగగా వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించారు.గుట్టపైన గల బాలాలయంలో వైకుంఠ ద్వారం ద్వారా గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు. గురువారం తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు యాదాద్రి ఆలయానికి చేరుకొని స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకుoటున్నారు. సూర్యుడు ఉత్త రాయణానికి ముందు వచ్చే మార్గశిర శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి(ముక్కోటి ఏకాదశి) అంటారు. ఈ రోజున సాక్షాత్తు మహావిష్ణువు గారుడవహనంపై ముకోటి దేవతలతో భూలోకానికి వేంచేసి భక్తులకు దర్శనం ఇస్తారని నమ్మకం. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయి. అందుకే భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకొని పాపవిముక్తులు అవుతారు.

Huge devotees visit Yadadri Temple