Thursday, May 2, 2024

స్వాతంత్య్ర యోధులపై మీడియాలో కథనాలు ప్రారంభించిన వెంకయ్య

- Advertisement -
- Advertisement -

Venkaiah started articles in media on Freedom Fighters

 

న్యూఢిల్లీ : స్వాతంత్య్ర పోరాట కాలంలో సెల్యులర్ జైలు జీవితం అనుభవించి దేశం కోసం త్యాగం చేసిన యోధుల సాహస చరిత్రలపై సోషల్ మీడియాలో సీరీస్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శనివారం ప్రారంభించారు. అండమాన్, నికోబార్ దీవుల్లో ఉండే ఈ జైలును కాలాపానీగా బ్రిటిష్ వారు పిలిచేవారు. మీడియా మొదటి పోస్టులో వీరసావర్కర్‌గా కీర్తి గడించిన వినాయక్ సావర్కర్‌పై వెంకయ్యనాయుడు వివరాలు రాశారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న చారిత్రక సందర్భంలో ఆనాటి త్యాగపురుషుల స్ఫూర్తి దాయకమైన జీవితాలను ప్రజలు గుర్తు చేసుకోవడం అవసరమని ఆయన పేర్కొన్నారు. ఇటీవల వెంకయ్యనాయుడు మహిళా స్వాతంత్ర యోధురాళ్ల జీవిత గాధలను వెలుగు లోకి తెచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News