Monday, May 20, 2024

కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకోవడంపై విహెచ్ ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : ఖమ్మంలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభకు వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ముందు పోలీసులు సుమారు 40 ఆటోలను తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేవని స్టేషన్లో పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ హనుమంతరావు(వీహెచ్) అక్కడికి చేరుకుని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ బయట గేటు వద్ద కార్యకర్తలతో కింద బైఠాయించి, నిరసన తెలిపారు. దీనిపై సీఐ రాజిరెడ్డి ఆయనతో మాట్లాడారు. వాహనాలకు పత్రాలు లేవని, అందులో భాగంగానే అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ కుమారుడు రాహుల్ గాంధీ మీటింగ్ కు అడ్డంకులు సృష్టించటమేంటని ప్రశ్నించారు. ఆ తల్లి తెలంగాణను ఇవ్వడం వల్ల ఈరోజు కేసిఆర్ ముఖ్యమంత్రి అయ్యారన్నారు. లేకుంటే నాంపల్లి వద్ద అల్లాకేనాంపే దేదో.. బాబా అనే వాడని విమర్శించారు. వాహనాలను పంపిస్తేనే తాను ఇక్కడ నుంచి వెళతానని భీష్మించారు. దీనిపై ఎస్‌ఐ వెంటకృష్ణ వాహనాల వివరాలను తీసుకుని, విడిచిపెట్టడంపై పోలీసులకు వీహెచ్ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కరుణగిరి వద్ద పోలీసులు భారీ కేడ్లు ఏర్పాటు చేయగా రేణుక చౌదరి వాటిని తొలగించారు. తమ శ్రేణులను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులను హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News