Friday, May 3, 2024

బిఆర్‌ఎస్‌తోనే గ్రామాలు సస్యశ్యామలం

- Advertisement -
- Advertisement -

మిడ్జిల్ : తెలంగాణ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బాకీపడి ఉన్నారని బీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాలు సస్యశ్యామలమయ్యాయని జడ్చర్ల ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి అన్నా రు. శనివారం మిడ్జిల్ మండల పరిధిలోని కంచన్‌పల్లి వాడ్యాల, మిడ్జిల్ గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద్రభంగా కంచన్‌పల్లి గ్రామంలో మన ఊరి మన బడి పథకంలో భాగంగా పాఠశాల మౌలిక వ సతుల నిర్మాణాలను ప్రారంభించారు.

మిడ్జిల్ మం డల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వాడ్యాల గ్రామంలోని డ్వాక్రా మహిళా సంఘం భవనానికి శంకుస్థాపన చేశారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో నిర్మించిన పాఠశాల ప్రహరీ గోడ అదన పు గదులు ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామ సర్ప ంచ్ మంగమ్మ శ్రీనివాసులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత గ్రా మాలు ఎంతో అభివృద్ధ్ది చెందాయని , బీటీ రోడ్లు, సీసీ రోడ్లు నిర్మాణాలు జరిగాయని , గత పాలకుల నిర్లక్షం వల్ల గ్రమాలు కుంటిపడి ఉన్నాయని ఆ యన అన్నారు.

ఎన్నికల సమయాలలో ఆయా పార్టీల నాయకులు కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకోవాలని చూస్తారని ప్రజలు వారికి సరైన బుద్ది చెప్పాలన్నారు. రాబోయే ఎన్నికలలో బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించి గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్ , జడ్పీటీసీ శశిరేఖాబాలు, సింగిల్‌విండో అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ సాయి లక్ష్మి, తహసీల్దార్ రాజునాయక్, ఎంపీఓ అనురాధ, డిప్యూటీ ఇంజనీర్ హిరియానాయక్, సర్పంచులు జంగారెడ్డి నారాయణరెడ్డి, రాధిక వెంకట్‌రెడ్డి, సునీత నర్సింహారెడ్డి, రా ధిక ప్రతాప్‌రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఎల్లయ్యయాదవ్, సత్యం గుప్తా, శ్రీనివాస్ గుప్తా, బంగారు, భీంరాజ్, సురేందర్‌గౌడ్, జగన్‌గౌడ్, గోపా ల్ , శేఖర్‌లతో పాటు పలు గ్రామాలకు చెందిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News