Thursday, May 2, 2024

టీ20 సినిమా

- Advertisement -
- Advertisement -

Virgin Story Teaser released

 

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా వర్జిన్ స్టోరి. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రదీప్ బి.అట్లూరి ఈ చిత్రంతో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొని టీజర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ… “ఈ సినిమా టీజర్, పాటలు చాలా బాగున్నాయి. విక్రమ్ చక్కగా నటించాడు. యూత్ ఆడియన్స్‌కు వర్జిన్ స్టోరి సినిమా నచ్చుతుందని నమ్ముతున్నాను”అని తెలిపారు. నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ… “వర్జిన్ స్టోరి ఒక నావెల్ స్టోరి. టీ20 సినిమా అని చెప్పొచ్చు. అంటే టీనేజ్ ప్రేక్షకుల నుంచి 20 ఇయర్స్ వరకు ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యే చిత్రమిది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో లగడపాటి శిరీష శ్రీధర్, దర్శకుడు ప్రదీప్ బి. అట్లూరి, నటుడు చైతన్య కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News