Wednesday, December 4, 2024

ట్రంప్‌కు ముప్పు పొంచి ఉందన్న పుతిన్

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం కజక్‌స్తాన్‌లో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ను ‘తెలివైన రాజకీయ నేత’ అని పొగుడుతూనే ఆయన భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్‌పై హత్యకు ఇటీవల కొన్ని ప్రయత్నాలు జరిగిన నేపథ్యంలో పుతిన్ విలేకరుల వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. పుతిన్ అదే సమయంలో ఉక్రెయిన్‌కు ఒక హెచ్చరిక జారీ చేశారు. కీవ్‌పై విధ్వంసం సృష్టించగల ఒరెష్నిక్ క్షిపణులు ప్రయోగించగలమని పుతిన్ హెచ్చరించారు.

దినిప్రో నగరంపై ఇటీవల మోహరించిన ఈ మధ్య శ్రేణి క్షిపణులను ఏ గగనతల రక్షణ వ్యవస్థా అడ్డుకోజాలదని ఆయన అన్నారు. గత జూలైలో పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో రిపబ్లికన్ ప్రచార ర్యాలీ సమయంలో ట్రంప్‌పై జరిగిన దాడిని పుతిన్ ప్రస్తావించారు. ఆ ఘటనలో ఒక తూటా ట్రంప్ చెవిని తాకగా, తీవ్రంగా రక్తస్రావమైన విషయం విదితమే. సెప్టెంబర్‌లో ఫ్లోరిడాలోని ట్రంప్‌కు చెందిన మార్‌ఎలాగో గోల్ఫ్ క్లబ్‌లో మరొక ఘటన చోటు చేసుకుంది. ట్రంప్ లక్షంగా ఒక రైఫిల్‌ను చేతిలో పట్టుకున్న ఒక వ్యక్తిని ఆ సమయంలో అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News