Friday, August 8, 2025

ఓట్ల చౌర్యం.. ఇదిగో సాక్షం

- Advertisement -
- Advertisement -

ఎన్నికల సంఘం.. బిజెపి కుమ్మక్కు భారీ స్థాయిలో రిగ్గింగ్‌కు
ఓట్ల చోరీ ఫలితాలు తారుమారు చేసిన ఓట్ల సర్జికల్ స్ట్రైక్
కర్నాటక మహదేవ్‌పూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో లక్ష నకిలీ ఓట్లు
కా్రంగెస్ అభ్యర్థి ఓటమికి ఈ ఓట్లే కారణం ఓటర్ల నమోదు
ప్రక్రియలోనే అనేక అక్రమాలు ఓటర్ల జాబితాను డిజిటల్
ఫార్మాట్‌లో ఎందుకు ఇవ్వడం లేదు? మహారాష్ట్ర, హర్యానా
ఓటర్ల జాబితాలలోనూ అవకతవకలు ఎన్నికల అక్రమాలపై
రాహుల్ గాంధీ పేల్చిన తొలి అణుబాంబు

న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల సక్రమ నిర్వహణకు జవాబుదారిగా ఉండాల్సిన ఎన్నిక ల సంఘమే ఘోర అక్రమానికి పాల్పడిందని కాంగ్రెస్ ఎంపి, లోక్‌సబలో ప్రతిపక్ష నే త రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్నాటక ఓటర్ల జాబితా చిట్టాను ఉదాహరణగా తీసుకుని ఆయన గురువారం ఇక్కడ ప్రత్యేకంగా విలేకరుల సమావేశం పెట్టి ఇసిపై తమ దాడిని పలుస్థాయిల్లో తీవ్రతరం చేశారు. తాను ఇప్పుడు తీసుకుంటున్నది కేవ లం కర్నాటకలోని బెంగళూరు సెంట్రల్ పార్లమెంటరీ నియోజకవర్గం అక్రమాలు, అందులోనూ కేవలం అక్కడి మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగిన ఓట్ల చోరీ గురించి అని తెలిపారు. దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో ఏదో విధంగా గెలుపునకు బిజెపి కుట్ర పన్నింది. ఇందుకు ఎన్నికల సంఘాన్ని ‘

తన కీలుబొమ్మగా చేసుకుని అసాధారణ రీతిలో వాడుకుందని ఆయన తీవ్రస్థాయిలో ఎన్నికల సంఘం వ్యవస్థపై ఆరోపణలు చేశారు. ఓటర్ల జాబితాల్లోకి నకిలీల పేర్లను చేర్చారు. నిజమైన ఓటర్లపై వేటేశారు. ఇందుకు తాను అక్కడి అసెంబ్లీ సెగ్మెంట్ ఓటర్ల జాబితాలోని అం శాలను ఇప్పుడు మీడియా ద్వారా ప్రజల ముందుకు తీసుకువస్తున్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై చౌర్యం ఆరోపణలకు దిగిన ఈ మీడియా సమావేశం దేశవ్యాప్తంగా పలు టీవీ ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఆయన పేర్కొన్న అంశాలు సంచలనానికి దారితీశాయి. బిజెపి అనుకూలురులను ఓటర్ల జాబితాల్లో చేర్చేందుకు యత్నించారు. దొంగ ఓటర్లను సృష్టించడం ద్వారా గెలుపోటములపై ప్రభావం పడేలా చేశారు. తన వాదన నిరూపించుకునేందుకు రాహుల్ ఈ సందర్భంగా ఈ సెగ్మెంట్ ఓటర్ల లిస్టును, పేర్లను ఇతర వివరాలను తెలియచేశారు. మహదేవపురలో జరిగింది భయంకర చోరీ అని వ్యాఖ్యానించారు.

కర్నాటక ఓట్ల చోరీ ఓ శాంపుల్
ఇప్పుడు జరిగింది అత్యున్నత స్థాయి , పైగా అధికారిక ఎన్నికల నియంత్రణ వ్యవస్థ ఎన్నికల సంఘం ద్వారా అధికార పక్షం చేయించిన భారీ స్థాయి రిగ్గింగ్ అని రాహుల్ తెలిపారు. దీనిని ఎలక్షన్ స్కామ్ అందామా? లేక ఓట్ల కుంభకోణం అనవచ్చా? అనేది ఎవరికి వారుగా నిర్థారించుకోవచ్చునని తెలిపారు. లోక్‌సభ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న దశలోనే , ఓ వైపు బీహార్ సర్ ప్రక్రియపై పార్లమెంట్‌లో విపక్షాల తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నప్పుడే రాహుల్ కీలక మీడియా సమావేశం జరిగింది. మహాదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య ఆరున్నర లక్షలు. కాగా ఇక్కడ ఇసి బిజెపి కుమ్మక్కు దరిమిలా 1 లక్షకు పైగా ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ తన చేతుల్లోని ఓటర్ల జాబితా కట్ట చూపిస్తూ తెలిపారు. నిజాయితీ ఓట్లపై ఇక్కడ జరిగింది మహాదేవపుర ఓట్ల సర్జికల్ దాడి అని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం ద్వారా జరుగుతూ వస్తోన్న అక్రమాల వ్యవహారం గురించి తమ పార్టీ కాంగ్రెస్ విస్తృత స్థాయి అంతర్గత సర్వే వంటి అధ్యయనం నిర్వహించడం జరిగిందని ,

ఇక్కడ లక్షకు పైగా డూప్లికేట్ ఓటర్లు , తప్పుడు చిరునామాలు ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఉన్నట్లు తేలిందని రాహుల్ వివరించారు. బెంగళూరు సెంట్రల్ ఎంపి సీటులో పోటాపోటీ పరిస్థితి ఉండిందనే విషయాన్ని ఈ సందర్భంగా రాహుల్ తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల దశలో తొలి రౌండ్ మొదలుకుని చివరి వరకూ కాంగ్రెస్ అభ్యర్థి మన్సూర్ అలీ ఖాన్ ఓట్ల ఆధిక్యత కనబర్చారు. అయితే తుది ఫలితంలో బిజెపికి చెందిన పిసి మోహన్ 32,707 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచినట్లు ప్రకటించారని , ఇదేం చోద్యం అని రాహుల్ ప్రశ్నించారు. ఇక్కడ అభ్యర్థుల వారిగా దక్కిన ఓట్ల లెక్కలను ఆయన విడమర్చి చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చింది 6,26,208 ఓట్లు. బిజెపి అభ్యర్థికి దక్కింది 6,58,915 ఓట్లు. ఇక్కడ మొత్తం ఏడు సెగ్మెంట్లలో ఆరింటిలో కాంగ్రెస్ ఆధిక్యతే ఉంది. అయితే మహాదేవపుర సెగ్మెంట్‌లో తమ పార్టీ ఏకంగా లక్షకు పైగా ఓట్ల తేడాతో వెనుకబడిందని లెక్కలు చూపారు. ఇక్కడ ఏకంగా 1,00,250 ఓట్లు చోరీ అయ్యాయి. 11,965 నకిలీ ఓట్లు ఉన్నాయి. 40వేలకు పైగా ఓటర్లు తప్పుడు చిరునామాలతో ఉన్న బూటకపు ఓటర్లే అని తెలిపారు. ఓటర్ల నమోదు ప్రక్రియలోని పలు కీలక ఘట్టాల దశల్లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. 33,692 ఓటర్లు కావాలనే ఓటర్ల నమోదు సంబంధిత ఫారం 6ను దుర్వినియోగం చేశారని , 4132 ఓటర్ల కార్డుల్లో మారుఫోటోలు ఉన్నాయని తెలిపారు.

ఓటర్ల జాబితాను డిజిటల్ ఫార్మాట్‌లో ఎందుకు ఇవ్వడం లేదు
ఎన్నికల సంఘం హైటెక్ అయినట్లు అయితే ఓటర్ల జాబితా వివరాలను ఎందుకు ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో ఇవ్వడం లేదని రాహుల్ ప్రశ్నించారు. ఇది పలు అనుమానాలకు దారితీస్తోందన్నారు. డిజిటల్ రూపంలో అందిస్తే కేవలం 30 సెకండ్లలోనే నియోజకవర్గాల వారిగా ఓట్ల అక్రమాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. ఈ సెగ్మెంట్‌లో అక్రమాల గురించి తెలుసుకునేందుకు తమకు ఆరు నెలల సమయం పట్టిందని చెప్పారు. ఎలక్ట్రానిక్ డేటా ఇచ్చి ఉంటే దీనిని సెకండ్లలోనే తేల్చుకోవచ్చునని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారీగా ఇసి ద్వారా భారీ అక్రమం జరిగిందని, మహారాష్ట్ర , హర్యానా వంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ కూటమికి అనుకూలత ఉందని పలు సర్వేల్లో తేలింది. తమకు కూడా క్షేత్రస్థాయిలో ఇదే తెలిసింది. ఎగ్జిట్ పోల్స్, ఒపినియన్ పోల్స్‌కు విరుద్ధంగా పలితాలు రావడం తమ అనుమానాలను బలోపేతం చేసిందన్నారు. పలితాలు ఎందుకు తిరగబడ్డాయనేది ఈ ఓట్ల రిగ్గింగ్‌తో స్పష్టం అవుతోందని, ఈ విషయాల గురించి తాము మరింతగా త్వరలోనే వివరిస్తామని రాహుల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News