Wednesday, May 8, 2024

మోరంచపల్లి వరద బాధితులకు అండగా ఉంటాం : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: మోరంచపల్లి వరద బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు.ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామంలో కిషన్‌రెడ్డి పర్యటించారు. వరద బీభత్సం ఎలాంటి విలయాన్ని సృష్టించిందో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కిషన్‌రెడ్డికి వివరించారు. అనంతరం దెబ్బతిన్న జాతీయ రహదారి మొదట పరిశీలించి, బాధితులను ఇంటింటి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మోరంచపల్లి గ్రామానికి ఇలాంటి ప్రకృతి విపత్తూ రావడం చాలా బాధాకరం అన్నారు.

వరద ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు కేంద్రప్రభుత్వం తరుపున రూ.3 లక్షలు, రాష్ట్రం నుండి 1లక్ష మొత్తం నాలుగు లక్షల రూపాయిలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రకృతి విపత్తుల నుండి ఆదుకోవడం కోసం రాష్ట్రం ప్రభుత్వం వద్ద డిజాస్టర్ ఫండ్ రూ. 900 కోట్లు ఉన్నాయని అన్నారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం 75 శాతం , రాష్ట్రం 25 శాతం ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయం కింద డిజాస్టర్ ఫండ్‌ను ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదన్నారు. బీజేపీ పార్టీ తరుపున కూడా బాధితులకు అన్ని విధాలుగా సహయ సహకారాలు అందజేస్తున్నారని స్పష్టం చేశారు. అలాగే సోమవారం నుండి కేంద్ర బృందాలు వస్తాయని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తుంది అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News