Saturday, May 18, 2024

కట్టమైసమ్మ ఆలయ నిర్మాణం చేపడతాం : పద్మారావు గౌడ్

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్ : చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయంలో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవంలో రెండవ రోజు రంగం కార్యక్రమం ప్రజావతి భవిష్యవాణిని వినిపించింది. కార్యక్రమంలో ఉప సభాపతి పద్మారావు గౌడ్ ముఖ్య అతిధిగా హాజరై ప్రశ్నలు అడిగారు. రైతులు సంతోషంగా ఉంటారని, వర్షాలు సమృద్దిగా కురుస్తాయని అన్నారు. ఆలయ పూనర్మానం ఈ ఏడాదిలోనే చేపడతామని పద్మారావు తెలిపారు.

రానున్న ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎవరు గెలుస్తారని భక్తులు ప్రశ్నించగా మూడవ సారి కూడ పద్మారావు గౌడ్ ఘన విజయం సాధిస్తారని, ఆయనే ఆలయాన్ని అభివృద్ది చేస్తారని భవిష్యవాణి సమాదానం చెప్పారు. ఈ సందర్బంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్‌లో బోనాల ఉత్సవాలు ఘనం నిర్వహంచామని చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయాన్ని పూనర్నిర్మాణం చేపడతామని నగరానికే మణిహారంగా ఆలయాని అందంగా తీర్చిదిద్దుతామన్నారు.

అమ్మవారి ఆశిస్సులు ప్రజలందరికి సమృద్దిగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సామల హేమ, ఆలయ ఈఓ మహేందర్, బోనాల వేడుకల్లో మారిషస్ నుంచి వచ్చిన ఐపిఎస్ స్థాయి శిక్షణకు వచ్చిన అధికారిణి శాలోన్, తూర్పు మండల డిసిపి సునిల్ దత్ , ఎసిపి జైపాల్ రెడ్డిలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News