Thursday, May 2, 2024

రాజ్‌భవన్‌లో ధర్నా చేసుకోండి..

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఏ విషయంపై అయినా ఏకంగా రాజ్‌భవన్‌లోపలే ధర్నాకు దిగవచ్చునని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను గవర్నర్ తొక్కిపెడుతున్నారని, ఇందుకు నిరసనగా తాను రాజ్‌భవన్ వెలుపల ధర్నాకు దిగుతానని ఒక్కరోజు క్రితం మమత బెనర్జీహెచ్చరించారు. దీనిపై గురువారం గవర్నర్ ఆనంద్ స్పందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తమ గౌరవనీయ అతిధి అని, ఆమె రాజ్‌భవన్ బయట ఎందుకు అతిధిగా రాజ్‌భవన్‌లోపలికే వచ్చి ధర్నాకు దిగవచ్చు, నిరసన వ్యక్తం చేయవచ్చు. ఆమెను కాదనేవారెవ్వరు ? అని ప్రశ్నించారు. ఆమె ఎక్కడో నిలబడటం , ధర్నాకు కూర్చోవడం ఇదంతా ఎందుకు? రాజ్‌భవన్ తలుపులు ఆమెకు తెరిచే ఉంటాయని గవర్నర్ ఆనంద్ ఇక్కడి విమానాశ్రయంలో విలేకరులతో చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News