Sunday, April 28, 2024

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏమిటి ?

- Advertisement -
- Advertisement -

రసాయనికంగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అని పిలుస్తారు. ప్రాసెస్ చేయని లేదా చాలా తక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాల్లో విటమిన్లు, పోషకాలు, చెక్కు చెదరకుండా ఉంటాయి. తినదగని భాగాలను తొలగించడం, ఎండబెట్టడం, చూర్ణం చేయడం, వేయించడం, ఉడకబెట్టడం, గడ్డకట్టడం, లేదా పాశ్చరైజేషన్ చేయడం ద్వారా ఈ ఆహారాలను ప్రాసెస్ చేస్తారు. వాటిని నిల్వ చేయడానికి సురక్షితంగా తినడానికి అనుకూలంగా ఉంటాయి.

ప్రాసెస్ చేయని, లేదా కనిష్టంగా, ప్రాసెస్ చేయబడిన ఆహారాల్లో క్యారెట్లు, యాపిల్స్ పుచ్చకాయ , గింజలు ఉంటాయి. ప్రాసెసింగ్ చేసిన ఆహారం దాని సహజ స్థితిలో కాకుండా కొంత మార్చి ఉంటుంది. ప్రాసెస్ చేయబడిన ఆహారాల్లో ఉప్పు, నూనె, చక్కెర, లేదా ఇతర పదార్థాలను జోడిస్తారు. కొన్ని ఆహారాలను ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు. లేదా అల్ట్రా ప్రాసెస్ చేస్తారు. చక్కెర, ఉప్పు, కొవ్వు, కృత్రిమ రంగులు లేదా ప్రిజర్వేటివ్స్ వంటి అనేక అదనపు పదార్ధాలను జోడిస్తారు. అల్ట్రా ప్రాసెస్ చేసే ఆహారాలు ఎక్కువగా కొవ్వులు, పిండి పదార్థాలు, చక్కెరలు, హైడ్రోజనేటెట్ కొవ్వులు, వంటి ఆహారాల నుండి సేకరించిన పదార్థాల నుంచి తయావుతాయి.

అవి కృత్రిమ రంగులు, రుచులు, లేదా స్టెబిలైజర్‌ల వంటి సంకలితాలను కూడా కలిగి ఉండవచ్చు. ఫ్రోజెన్ మీల్స్, శీతల పానీయాలు, పాస్ట్ ఫుడ్ , ప్యాక్ చేసిన కుక్కీలు, కేకులు, స్నాక్స్ వీటిని అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌గా పరిగణించవచ్చు. ప్రాసెస్ చేసే ఆహారాల్లో చక్కెరను జోడిస్తుంటారు. ఈ చక్కెరలో పోషకాలు ఉండవు. కానీ కేలరీలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్, టైప్ 2 డయాబెటిస్, ఇన్‌ఫ్లమేటరీ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.

ప్రాసెస్ చేసిన ఆహారం రుచిగా ఉండేందుకు కృత్రిమ రసాయనాలు జోడిస్తుంటారు. శుద్ధి చేసిన కార్బొహైడ్రేట్లను ప్రాసెస్ పదార్థాల్లో వినియోగిస్తుంటారు. దీనివల్ల రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిల్లో హెచ్చుతక్కువలు వస్తుంటాయి. టైప్2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పూర్తి స్థాయి అవసరమైన పోషకాలను పొందడానికి ఉత్తమ మార్గం పూర్తిగా, ప్రాసెస్ చేయని లేదా కనిష్టంగా ప్రాసెస్ చేసిన ఆహారాన్నితీసుకోవడం చాలా మంచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News