Wednesday, April 30, 2025

ఉగ్రవాదులపై స్పైవేర్ ఉపయోగిస్తే తప్పేంటి?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ‘దేశ వ్యతిరేక శక్తులపై స్పైవేర్’ ఉపయోగించడంలో తప్పు ఏమి ఉందని సుప్రీం కోర్టు మంగళవారం ప్రశ్నించింది. పెగాసస్ స్పైవేర్ వివాదం పై సాంకేతిక కమిటీ సమర్పించిన నివేదికను బహిర్గతం చేయలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దేశ భద్రత, సార్వభౌమాధికారానికి సంబంధించిన సు న్నితమైన అంశాలు ఉన్నందున ఈ నివేదికను బయటపెట్టలేమని న్యాయమూర్తులు సూర్యకాంత్, ఎన్ కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం విస్పష్టంగా ప్రకటించింది. దేశ భద్రతకు సంబంధించిన నివేదికలోని అంశాలను బహిరంగ చర్చకు పెట్టడం సరి కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘దేశ భద్రత, సార్వభౌమాధికారానికి సంబంధించిన ఏ నివేదికనూ మేము బహిర్గతం చేయబోం. అటువంటి నివేదికలను వీధి చర్చల పత్రంగా మార్చకూడ దు’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. పెగాసస్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల వి చారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో వ్యక్తిగత గోప్యత ఉల్లంఘనకు సంబంధించిన ఆందోళనలను పరిహరించే విషయం పరిశీలించవచ్చునని బెంచ్ సూచనప్రాయంగా తెలియజేసింది.

గోప్యత హ క్కుకు భంగం వాటిల్లిందని భావించే వ్యక్తుల నిర్దిష్ట కేసులను పరిష్కరించే అవకాశం ఉందని బెంచ్ సంకేతాలు ఇచ్చింది. దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూనే వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఫిర్యాదులు వినేందుకు సుప్రీం కోర్టు సుముఖంగా ఉన్నట్లుతెలుస్తోంది. సాంకేతిక కమిటీ నివేదికను ఏ మేరకు బహిర్గతం చేయవచ్చునో పరిశీలిస్తామని సుప్రీం కోర్టు తెలియజేసింది. పిటిషనర్లలో ఒకరి తరఫున హాజరైన న్యాయవాది దినేష్ ద్వివేది మాట్లాడుతూ, ప్రభుత్వం వద్ద స్పైవేర్ ఉండి, దానిని వినియోగించిందా అన్నదే ప్రశ్న అని అన్నారు. ‘వారి వద్ద అది ఉన్నట్లయితే, దానిని ఇప్పటికీ వాడడం నుంచి వారిని ఏదీ నిలువరించలేదు’ అని ద్వివేది పేర్కొన్నారు. దీనికి బెంచ్ స్పందిస్తూ, ‘వ్యక్తులకు సంబంధించి వెల్లడి చేయడం గురించి దయచేసి వాదనలు చేయండి. ప్రస్తుతం మేము ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఒకింత బాధ్యతాయుతంగా ఉందాం& నివేదికను ఏమేరకు బహిర్గతం చేయదగునో పరిశీలిస్తాం’ అని పేర్కొన్నది. పెగాసస్ వ్యవహారంలో సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సాంకేతిక నిపుణుల కమిటీని గతంలో ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఆ కమిటీ నివేదికను సమర్పించినప్పటికీ దానిలోని అంశాలను గోప్యంగా ఉంచాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News