Thursday, May 2, 2024

నీటిపారుదలశాఖపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: నీటిపారుదల శాఖపై శనివారం రాష్ట్రశాసనసభలో ప్రభుత్వం స్వేతపత్రం విడుదల చేయనుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్బాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయన ఘటనలో ప్రభుత్వం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ద్వారా విచారణ చేయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మూడు రోజుల కిందట శా ససభ సభ్యులు , శాసనమండలి సభ్యులు స్వయంగా మేడిగడ్డ బ్యారేజిని సందర్శించారు. పగుళ్లు ఇచ్చి, కుంగిపోయన పియర్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగానే సిఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖపై ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తుందని ప్రకటించారు.

శుక్రవారం నా డే సభలో శ్వేతపత్రం విడుదల చేయాల్సివుంది. అంతే కాకుండా నీటిపారుదల శాఖపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్‌అనుమతి మేరకు అంసెంబ్లీలో పెద్ద డిజిటల్ స్కీన్లు రెండింటిని స్పీకర్ స్థా నానికి ఇరువైపులా ఏర్పాటు చేసింది.అయితే శుక్రవారం ఇందుకు సభా సమయం సరిపోకపోవటం, అధికశాతం సభ్యులు శనివారం నాడు శ్వేతపత్రం విడుదల చేసి ఈ అంశంపై సమగ్రంగా చర్చజరపాలని కోరటంతో వివిధ పార్టీల సభ్యుల అభిప్రాయాల మేరకు ప్రభుత్వం ఈ అంశాన్ని శనివారం నాటికి వాయిదా వేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News