Friday, May 3, 2024

ఇండియా కూటమి పేరు భారత్‌గా మారిస్తే అప్పుడేం చేస్తారు?: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జి20 విందుకు పంపిన ఆహ్వానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ తరఫున అని పేర్కొనడంపై వివాదం ఏర్పడిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి తన పేరును భారత్‌గా మార్చుకుంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తిరిగి భారత్ పేరును ిండియాగామారుస్తుందాఅని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

నరేంద్ర మోడీ ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జి20 విందు ఆహ్వాన లేఖలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసినట్లు కాంగ్రెస్ మంగళవారం ఆరోపించింది. ఈనెలలో జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఇండియా పేరును భారత్‌గా మార్చడానికి ఒక రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టవచ్చని కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ దీనిపై విలేకరులతో మాట్లాడుతూ తనకు అధికారికంగా ఇందుకు సబంధించిన సమాచారం లేదని, తాను కేవలం ఊహాగానాలు మాత్రమే విన్నానని చెప్పారు.

ఇండియా కూటమి ఏర్పాటుతో బిజెపిలో కలవరం మొదలైందని ఆయన అన్నారు. కొన్ని ప్రతిపక్ష పార్టీలు కలసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయని, ఇండియా కూటమి తన పేరును భారత్ అని మార్చుకున్న పక్షంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం  భారత్  అని మార్చిన పేరును మళ్లీ  ఇండియాగా మార్చుతుందా ప్రశ్నించారు. ఇది దేశ ద్రోహమేనని ఆయన ఆరోపించారు.
ప్రతిపక్ష కూటమి ఏర్పాటుతో ఆందోళన చెందుతున్న బిజెపి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఒకే దేశం, ఒకేఎన్నికలు అంటూ కొత్త ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చిందని ఆయన ఆచెప్పారు. ఇప్పుడు దేశం పేరును మార్చడం కూడా మరో ఎత్తుగడని ఆయన వ్యాఖ్యానించారు.

సనాతన ధర్మంపై డిఎంకె నాయకుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఏర్పడిన వివాదాన్ని గురించి విలేకరులు ప్రశ్నించగా అన్ని మతాలను ప్రజలు గౌరవించాలని ఆయన అన్నారు. తాను సనాతన ధర్మానికి చెందినవాడినని, మనలో చాలా మంది సనాతనధర్మానికి చెందినవారేనని ఆయన అన్నారు. ఇతరుల మతాన్ని మనం పరస్పరం గౌరవించాలని, మరో మతం గురించి తప్పుగా మాట్లాడకూడదని ఆయన హితవు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News