Thursday, May 2, 2024

కేబినెట్ హోదా వెనక్కి తీసుకోండి : యడ్యూరప్ప

- Advertisement -
- Advertisement -

Withdraw Cabinet rank status: Yediyurappa

 

బెంగళూరు : తనకు కేబినెట్ హోదాను కేటాయిస్తున్నట్లు శనివారం జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను ఆ రాష్ట్ర మాజీ సిఎం యడ్యూరప్ప కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆదివారం యడియూరప్ప ఓ లేఖ రాశారు. ‘మాజీ ముఖ్యమంత్రులకు ఇచ్చే వసతులను మాత్రమే తనకు కల్పించాలని కోరుతున్నాను. నాకు ఇచ్చిన కేబినెట్ ర్యాంకు హోదాను ఉపసంహరించుకోండి’ అని లేఖలో యడియూరప్ప పేర్కొన్నారు. కాగా,కర్ణాటక మాజీ సిఎం యడ్యూయూరప్పకు కేబినెట్ హోదా తరహా సౌకర్యాలు- కేబినెట్ మంత్రి మాదిరిగా జీతభత్యాలు, ప్రభుత్వ వాహనం, అధికార నివాసం వంటి సౌకర్యాలు కొనసాగించాలని బొమ్మై సర్కార్ శనివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సిఎం బసవరాజ్ ఆ పదవిలో ఉన్నంత వరకు యడియూరప్పకు కేబినెట్ హోదా సౌకర్యాలు అందుతాయని కర్ణాటక ప్రభుత్వ సిబ్బంది, పరిపాలనా సంస్కరణల విభాగం ఉత్తర్వుల్లో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News