విలక్షణ హీరో దుల్కర్ సల్మాన్ తన 41వ చిత్రం ‘డిక్యు41’ (DQ41) కోసం నూతన దర్శకుడు రవి నేలకుదిటితో చేతులు కలిపారు. లవ్ స్టొరీ తో పాటు అద్భుతమైన హ్యుమన్ డ్రామా గా రూపొందనున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇది నిర్మాణ సంస్థ 10వ వెంచర్. హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ముహూర్తపు షాట్‌కు నేచురల్ స్టార్ నాని క్లాప్ (natural star Nani Klopp) కొట్టారు. దర్శకుడు బుచ్చి బాబు సానా కెమెరా స్విచ్ ఆన్ చేయగా, గుణ్ణం సందీప్, నాని, రమ్య గుణ్ణం స్క్రిప్ట్‌ను టీంకు అందజేశారు. ఫస్ట్ షాట్‌కు రవి నెలకుడిటి స్వయంగా దర్శకత్వం వహించారు. దసరా, ది ప్యారడైజ్ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తారు. ఈ చిత్రం తెలుగు, మలయాళం, హిం దీ, కన్నడ, తమిళ భాషలలో పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది.
‘డిక్యు41’ చిత్రం ఆరంభం
- Advertisement -
- Advertisement -
- Advertisement -