Sunday, April 28, 2024

పాక్ కు సెమీస్ అవకాశాలు ఉన్నాయా?

- Advertisement -
- Advertisement -

ప్రపంచ కప్ లో పాకిస్తాన్ కు సెమీస్ చేరే అవకాశాలున్నాయా? అటు పాక్ అభిమానులనీ, ఇటు భారత్ అభిమానుల్నీ కూడా వేధిస్తున్న ప్రశ్న ఇది. లెక్కలు, కూడికలు వేసుకుంటే, ఒక్క పాకిస్తానే కాదు, న్యూజీలాండ్, ఆప్ఘనిస్తాన్, శ్రీలంకలకు కూడా సెమీస్ చేరే అవకాశం ఉంది.

పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ ప్రస్తుతం ఐదోస్థానంలో ఉంది. పదహారు పాయింట్లతో అగ్రభాగాన ఇండియా కొనసాగుతుంటే, తర్వాత వరుసగా సౌతాప్రికా (12 పాయింట్లు), ఆస్ట్రేలియా (8 పాయింట్లు), న్యూజీలాండ్ (8 పాయింట్లు)తో ఉన్నాయి. పాకిస్తాన్ కూడా 8 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. లీగ్ పోటీల్లో ఇక పాకిస్తాన్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇంగ్లండ్ తో పాకిస్తాన్ తలపడాల్సి ఉంది. ఎనిమిది మ్యాచ్ లు ఆడి, నాలుగింటిలో ఓడిపోయిన పాకిస్తాన్ సెమీస్ కు చేరాలంటే, రెండు మార్గాలున్నాయి.

1. ఇంగ్లండ్ పై జరిగే చివరి లీగ్ పోటీలో గెలవడమే కాదు, మిగతా జట్ల కంటే అత్యుత్తమ నెట్ రన్ రేటు సాధించాలి. ప్రస్తుతం పాకిస్తాన్ నెట్ రన్ రేటు దారుణంగా ఉంది.
2. ఒకవేళ ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయినా పాక్ సెమీస్ చేరే అవకాశం ఉంది. అదెలాగంటే… న్యూజీలాండ్, ఆప్ఘనిస్తాన్, శ్రీలంక, నెదర్లాండ్స్ కూడా భారీ తేడాతో ఓడిపోవాలి. అయితే ఇందుకు అవకాశం చాలా తక్కువ.

ప్రస్తుతం పాకిస్తాన్ నెట్ రన్ రేటు చాలా తక్కువగా ఉంది. ఇంగ్లండ్ పై గెలిచి, భారీ నెట్ రన్ రేటు సాధిస్తే, కొద్దిపాటి అవకాశాలున్నా మిగతా జట్లు సాధించే రన్ రేటుపై పాక్ అదృష్టం ఆధారపడి ఉంటుంది. న్యూజీలాండ్ కూడా ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఇంకా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ జట్టు ఏడు మ్యాచ్ లు ఆడి, ఎనిమిది పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. తన రెండు మ్యాచ్ లలోనూ ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే, పాకిస్థాన్ ఆశలు ఆవిరైనట్లే. అలాగే న్యూజీలాండ్ జట్టు తదుపరి మ్యాచ్ లో చక్కటి రన్ రేటుతో గెలిచినా, పాక్ అవకాశాలూ మూసుకుపోయినట్లే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News