Monday, April 29, 2024

‘లవ్ ఆల్’ మూవీ ఆడియో రైట్స్ సొంతం చేసుకున్న వింక్ స్టూడియో..

- Advertisement -
- Advertisement -

గురుగ్రామ్: డౌన్‌లోడ్స్, రోజువారీ క్రియాశీల యూజర్స్ ద్వారా భారతదేశం యొక్క నం.1 మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ అయిన వింక్ మ్యూజిక్, ఈరోజు భారతదేశం యొక్క అతిపెద్ద మ్యూజిక్ డిస్ట్రిబ్యూషన్ ఎకోసిస్టమ్ అయిన వింక్ స్టూడియో పి.గోపీచంద్ అనే బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ యొక్క జీవితం ఆధారంగా తెరకెక్కిన కే కే మీనన్ నటించిన “లవ్ ఆల్” అనే చిత్రం యొక్క డిస్ట్రిబ్యూషన్ హక్కులను గెలుచుకున్నట్లు ప్రకటించినది.

“లవ్ ఆల్” చిత్రాన్ని మహేశ్ భట్, పి గోపీచంద్ లు ఆనంద్ పండిట్ తో కలిసి నిర్మించారు. ఇది ఎమ్. రమేశ్ యొక్క లక్ష్మీ గణపతి ఫిల్మ్ స్టూడియోస్ ద్వారా సెప్టెంబర్ 1వ తేదీన విడుదల చేయబడుతుంది. ఈ చిత్రానికి సుధాంశు శర్మ దర్శకత్వం వహించగా, స్వస్తిక ముఖర్జీ, రాబిన్ దాస్, శ్రీశ్వర, అతుల్ శ్రీవాస్తవ, రాజా బుందెల నటించారు. ఈ సినిమాలో ఇప్పటికే వింక్ పై అందుబాటులో ఉన్న ఐదు చిరకాలం గుర్తుండిపోయే పాటలు ఉన్నాయి.

డిస్ట్రిబ్యూషన్ ఒప్పందం గురించి ఏర్‌టెల్ డిజిటల్ అండ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ ఆదర్శ్ నాయర్ మాట్లాడుతూ.. “వింక్ స్టూడియో స్వతంత్ర కళాకారుల కోసం ఒక సృజనాత్మక వేదికను అందించే లక్ష్యంతో స్థాపించబడింది, అలాగే ఇది వారు ఎదుర్కొనే మోనిటైజేషన్, ఆవిష్కరణల పరమైన సమస్యల విషయంలో కూడా వారికి సహాయపడుతుంది. మేము స్వతంత్ర కళాకారులతో గొప్ప విజయాలను పొందాము. ప్రస్తుతం వేయిమందికి పైగా కళాకారులు మాతో ఉన్నారు. ఈ డిస్ట్రిబ్యూషన్ భాగస్వామ్యం అనేది డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ కోసం అన్వేషిస్తున్న, ఏర్‌టెల్ యొక్క స్వాభావికమైన రీచ్, కనెక్టివిటీని ఉపయోగించాలనుకుంటున్న నిర్మాతల కోసం కొత్త ద్వైపాక్షిక మార్గాలను తెరుస్తుంది.” అన్నారు.

వింక్ స్టూడియో స్థాపించిన కాలం నుండి ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ వచ్చినది. ఇది ఇటీవల మంజ్ మ్యూజిక్, అనూష దండేకర్ ద్వారా వచ్చిన “లవ్ టోకెన్”, విశాల్ దద్లానీ యొక్క “బిల్లో”, నిఖిత గాంధీ యొక్క సింగిల్ అయిన ఒక ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన అమ్మాయి యొక్క రొమాంటిక్, గ్రూవీ నంబర్ “ప్యార్ మేన్ పాగల్” వంటి స్వతంత్ర సింగిల్స్ ను ఏకకాలంలో పంపిణీ చేసింది.

వింక్ 15 భారతీయ భాషలలో సంగీతాన్ని అందిస్తుంది. ప్రాంతీయ పాటలు ఇప్పుడు యాప్ పై మొత్తం స్ట్రీమ్ లలో 30% కు పైగా ఉన్నాయి. ఒరియా, గుజరాతీ, అస్సామీస్, మరాఠీ, తెలుగు, భోజ్‌పురి భాషల్లో గల పాటలు 150% కు పైగా వృద్ధిని సాధించాయి. అవి వారి స్వరాష్ట్రం వెలుపల కూడా ప్రసిద్ధి చెందాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News