Saturday, April 27, 2024

యాదాద్రిలో ధనుర్మాస పూజలకు శ్రీకారం

- Advertisement -
- Advertisement -

అండాళ్ అమ్మవారికి వైభవంగా ఊంజల్ సేవ…శ్రీవారి నిత్య కైంకర్యంలో భక్తులు
యాదాద్రి ఆలయ నిత్యరాబడి 21.30 లక్షలు

మనతెలంగాణ/యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో ధనుర్మాస పూజలకు శ్రీకారం చుట్టారు. వైష్ణవ క్షేత్రంలో నిర్వహించే ఈ పూజలను ప్రతి యేటా అత్యంత వైభవంగా మాసం రోజుల పాటు అమ్మవారికి శాస్త్రోత్తంగా ఆలయ సాంప్రదాయ పద్ధతిలో అర్చక స్వాములు నిర్వహిస్తారు. యాదాద్రి ఆలయ అభివృద్దిలో నూతన ఆలయంలో తొలిసారి నిర్వహిస్తూన్న ధనుర్మాస పూజలను ఆలయ ముఖమండపం ఉత్తర భాగాన మండపాని సుందరంగా ఏర్పాటు చేసి అండాళ్ అమ్మవారిని మండపములో వేంచేపు చేసి ధనుర్మాస ప్రత్యేక పూజలకు శ్రీకారం చుట్టారు. శుక్రవారము రోజున సాయంత్రము 6.15 గంటల నుండి ధనుర్మాసం రావడంతో శ్రీవారి ప్రధాన ఆలయంలో శాస్రోక్తంగా తిరుప్పావై సేవకాలం కైంకర్యాముని ఆలయ ప్రాధానర్చకులు నల్లంధీగల్ లక్ష్మీనరసింహ చార్యులు పూజలు నిర్వహించారు. మాసం రోజులు తెల్లవారుజామున 4.30 గంటలనుండి 5.15 గంటలవరకు అండాళ్ అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసి పూజలను చేపట్టనున్నారు. తొలిరోజు మార్గళి కైంకర్యమును అర్చకులు నిర్వహించి పూజ విశిష్టతను భక్త కోటికి ఆలయ ప్రధానార్చకులు తెలియచేశారు. ఈ పూజ వేడుకలలో ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటచ్చాలు, అర్చకులు మధుసుదాన చార్యలు, అర్చకుల బృదం, ఆలయ ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

పాతగుట్టలో…

శ్రీవారి అనుబంద ఆలయమైన శ్రీపాతలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రములో కూడ ధనుర్మాస పూజలను ప్రారంభించారు.మొదటి రోజున తిరుప్పావై పాశురంతో ప్రారంభించారు.

అండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ పూజలు

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో అండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవల పూజలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో సాయంత్రం ఆలయం మండపంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊంజల్ సేవ మహోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున 3.30 గంటలకు ఆలయాన్ని తెరచిన అర్చకులు సుప్రభాత, అర్చన, అభిషేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనాలు కల్పించారు. ఈ మహోత్సవ వేడుకలలో భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకొని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. సాయంత్రము అమ్మవారికి ప్రత్యేక అలంకరణ గావించిన అర్చకులు మేళతాలముల మద్య అమ్మవారి సేవను ఆలయ పూరివీదులలో ఊరేగించగా భక్తజనులు అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయంలో జరుగు నిత్యపూజల కైంకర్యంలో భక్తులు పాల్గొని తమ మెక్కుబడలు చెల్లించుకున్నారు.

Yadadri temple information

శ్రీవారి నిత్యరాబడి….

శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యాదాద్రి క్షేత్రంలో స్వామివారి ఆలయం నిత్యరాబడి భాగంగా శుక్రవారం రోజున 21 లక్షల 30 వేల 471 రూపాయలు అనుభంద ఆలయమైన పాతగుట్ట దేవాలయం, వివిధ శాఖల నుండి స్వామివారి నిత్యరాబడి సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News