Sunday, April 28, 2024

తనువు, మనసు, ఆత్మను ఏకంచేసే సాధనం యోగా

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘శాకాహారం యోగాకి మొదటి మెట్టు‘ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శాకాహరిగా మారాలన్న సంకల్పంతో నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ నిర్వహణలో ఖమ్మం పట్టణంలో బుధవారం వెజిటేరియన్ 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అడిషనల్ డిసిపి అత్తలూరి సుభాష్ చంద్రబోస్ పాల్గొని జండా ఊపి ర్యాలీని ప్రారంభించి ప్రసంగిస్తూ తనవు మనస్సు ఆత్మను ఏకం చేసే అత్యద్భుత సాధనం యోగా అని, యోగా ద్వారా మానసిక ప్రశాంతతతోపాటు సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమన్నారు.

నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు ఆచార్య శ్రీనివాస్ మాట్లాడుతూ ‘శాకాహరిగా మారితేనే మనం చేసే యోగాకి ఫలితం ఉంటుంది. యోగి వేమన, గౌతమ బుద్దుడు, వీర బ్రహ్మేంద్ర స్వామి, ఇలాంటి యోగులందరూ శాకాహరులే అని అన్నారు. మాంసాహారం తింటూ యోగానే కాదు. మానవ జీవితంలో ఏ పని చేసిన దుష్ఫలితాలే వస్తాయని. కనుక ఎవరికి వారు సొంత తెలివితో జంతు జాతిని హింసిస్తు మాంసం తినడం ఎంత వరకూ కరెక్టు? దీనిని సమంజసమా ఆలోచించుకోవాలని ఆయన కోరారు.

ఈ ఇంటర్నేషనల్ యోగా డే సృష్టి కర్త అయిన ప్రధాని నరేంద్ర మోడీ శాకాహరి అని ఆయన గుర్తు చేశారు. ఈ 2కె రన్ సర్దార్ పటేల్ స్టేడియం నుంచి ప్రారంభమై లకారం ట్యాంక్ బండ్ వద్ద వరకూ కొనసాగింది. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త డాక్టర్. కడవెండి వేణుగోపాల్, వివేకానంద ఎక్సలెన్సు నుంచి దేవకి వాసుదేవ్ రావు, పిరమిడ్ వేంకటేశ్వర్లు, ఎం. సరోజ, రఘురామ్ ప్రసాద్, చైన్ సింగ్, ఓం.నారాయణ పత్రి గణపతి ధ్యాన కేంద్ర సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News