Tuesday, April 30, 2024

యువభారతానికి ‘విరాట్ కోహ్లీ’ మనస్తత్వం: రఘురామ్ రాజన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశం నుంచి భారీ సంఖ్యలో యువకులు విదేశాల్లో వ్యాపారాలు నెలకొల్పుడానికి తరలి వెళ్లిపోతున్నారని, దేశంలో వారికి ఎక్కడా ఆనందం లేకపోవడమే కారణమని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు.

భారతీయ యువకులది ‘విరాట్ కోహ్లీ మనస్తత్వమని పోల్చి చెప్పారు. పరోక్షంగా కోహ్లీలా సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ ప్రపంచ వ్యాప్తంగా పోటీ పడాలనుకుంటున్నారని చెప్పారు.మనదేశానికి చెందిన చాలా మంది ఆవిష్కర్తలు సింగపూరో, సిలికాన్ వ్యాలీనో తరలిపోవడానికి కారణమేంటన్న ఓ ప్రశ్నకు రాజన్ పై విధంగా వివరించారు. చాలా మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ప్రపంచాన్ని మార్చాలన్న దృక్పథంతో ఉంటున్నారని, కానీ వారు మనదేశంలో ఉండేందుకు మాత్రం ఇష్టపడడం లేదన్నారు.

జార్జి వాషింగ్టన్ యూనివర్శిటీలో “మేకింగ్ ఇండియా యాన్ అడ్వాన్స్ ఎకానమీ బై 2047” అంశంపై నిర్వహించిన సదస్సులో రఘురామ్ రాజన్ మాట్లాడారు. డెమోగ్రఫిక్ డివిడెండ్ వల్ల కలిగే ప్రతిఫలాలు పొందడంలో మనం మధ్యస్థాయిలోనే ఉన్నామని చెప్పారు. ఈ విషయంలో చైనా, కొరియా ఎక్కువ ప్రతిఫలాన్ని పొందాయని గుర్తు చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించక పోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. దేశం మొత్తం జనాభాలో పనిచేయని వారితో పోలిస్తే పనిచేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్‌గా పేర్కొంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News