Sunday, April 28, 2024

సోషల్ మీడియాలో మోసం చేస్తున్న యువకుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః సోషల్ మీడియాలో యువతిగా ఇన్‌ఫ్లూయేన్సర్ ఫొటో పెట్టుకుని డబ్బులు వసూలు చేస్తున్న యువకుడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో నకిలీ ఐడిలతో ఖాతాలు ఓపెన్ చేసి మోసం చేస్తున్నాడు. ఎపిలోని విశాఖపట్టణానికి చెందిన తమ్మారెడ్డి శషాంక్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలో ఉంటూ సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నాడు. నిందితుడు సోషల్ మీడియా నకిలీ ఐడిలతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్ క్రియేట్ చేశాడు. వాటికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్ ఫొటో పెట్టి పలువురి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నాడు. నిందితుడు తన కజిన్ బ్రదర్ కిరణ్‌కుమార్‌కు మేఘనా రఘుపత్రిని పేరుతో రిక్వెస్ట్ పంపించాడు. దానిని కిరణ్‌కుమార్ ఆమోదించాడు, అప్పటి నుంచి కిరణ్‌కుమార్‌తో ఛాటింగ్ చేశాడు.

గత ఏడాది డిసెంబర్ 26వ తేదీన తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి రూ.3,000 తీసుకున్నాడు. ఇలా పలుమార్లు వివిధ కారణాలు చెప్పి డబ్బులు వసూలు చేశాడు. నిందితుడిని యువతిగా భావించిన కిరణ్‌కుమార్ రూ.1.03,000 వసూలు చేశాడు. ఫేస్‌బుక్ మేసేంజర్, వాట్సాప్‌లో ఛాటింగ్ చేసేవారు. డబ్బులు ఫోన్ పే, గూగుల్ పేలో పంపించేవాడు. డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పేవాడు కానీ ఎప్పుడు తిరిగి ఇవ్వలేదు. ఇద్దరు వివాహం చేసుకుందని కిరణ్‌కుమార్‌కు చెప్పేవాడు. కిరణ్ కుమార్ ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించినా కూడా అందుబాటులోకి వచ్చేవాడుకాదు, దీంతో కిరణ్ కుమార్ స్పందించడం మానివేశాడు. తర్వాత తనతో మాట్లాడుతున్నది తన సోదరుడని గ్రహించిన బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై గతంలో కూడా చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News