Thursday, May 2, 2024

యువతికి మత్తు మందు ఇచ్చి… నగ్నంగా వీడియోలు తీసి…

- Advertisement -
- Advertisement -

Youngers blackmail to Btech student

 

అమరావతి:  స్నేహం పేరుతో యువతికి మత్తు మందు ఇచ్చి నగ్నంగా వీడియోలు తీసి బెదిరించిన ఘటనలో ఇద్దరిని అరెస్టు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మూడేళ్ల క్రితం స్నేహం పేరుతో వరుణ్ అనే యువకుడు చదువుకుందామని యువతిని (20) తన ఇంటికి పిలిచాడు. అనంతరం ఆమెకు కూల్‌డ్రింక్స్‌లో మత్త మందు ఇచ్చి నగ్నంగా ఉంచి వీడియో తీశాడు. ఈ వీడియోలు అడ్డంపెట్టుకొని ఆమెను బెదిరించే ప్రయత్నాలు చేస్తుండగా అతడికి దూరంగా ఉంటుంది. ప్రస్తుతం బిటెక్ జాయిన్ కావడంతో కౌశిక్ అనే యువకుడితో స్నేహం చేస్తోంది. కౌశిక్ ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని అమ్మాయితో చెప్పడంతో అతడిని దూరంగా పెట్టింది. దీంతో వరణ్ నుంచి వీడియోలను తీసుకొచ్చి ఆమెను కౌశిక్ బెదిరించడం ప్రారంభించారు.  మరో యువకుడితో ఆమె చనువుగా ఉండడంతో అమ్మాయిని డబ్బులివ్వాలని లేకపోతే వీడియోలను ఇంటర్‌నెట్‌లోపెడుతానని కౌశిక్ బెదిరించాడు. ఇంటర్‌నెట్‌లో ఉన్న ఈ వీడియోలను యువతి బంధువులు కౌశిక్, వరుణ్ కుటుంబ సభ్యులను కలిసి తీసివేయించారు. కానీ ఆ వీడియోలు సోషల్ మీడియాలో కనిపించడంతో స్థానిక ఎస్‌పి అమ్మిరెడ్డికి యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి వరుణ్, కౌశిక్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News