Friday, May 3, 2024

యువత కళలను అంతరించిపోకుండా కాపాడాలి

- Advertisement -
- Advertisement -

భద్రాచలం : ప్రత్యేక తెలంగాణ కోసం 1969 నుంచి జరుగిన ఉద్యమాల్లో ఎంతోమంది కవులు, కళాకారులు,రచయితలు, సాహితీవేత్తలు తమవంతు పాత్ర పోషించారని తెలంగాణ ఏర్పడ్డాక వారందరికీ సముచిత స్థానం దక్కిందని భద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఆదివారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరిగిన సాహిత్య దినోత్సవం సందర్భంగా ఆయన భక్తరామదాసు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం మాట్లాడుతూ.. అంతరించి పోతున్న సాహిత్యానికి కవులు, సాహితీవేత్తలు, రచయితలు తమ రచనలు, పద్యాలతో సామాజంలో ఉన్న ప్రజలకు, రాబోయే తరానికి సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించడానికి ఎంతో కృషి చేశారని వారిని ఈ సందర్భంగా సన్మానించుకోవడం చాలా గర్వకాణమన్నారు. ఖమ్మం జిల్ల్లాకు చెందిన కంచర్ల గోపన్న, ఆదికవి హరిబట్టు, దాశరధి కృష్ణమాచార్యులు సాహిత్యపరంగా మనకు ఎన్నో సూక్తులు, కవితలు చెప్పారని అన్నారు. వారి స్ఫూర్తితోనే నేటికీ పలు చోట్ల సాహితీగోష్టిలు, కవి సమ్మేళనాలు జరుపుకుంటున్నామని చెప్పారు.

భక్తరామదాసు రాముడిపై అనేక పద్యాలు, పాటలు రచించి రామునిచే మెప్పు పొందిన గొప్ప భక్తుడని అటువంటి భక్తుడిని స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. నేటి యవత కవులను, సాహితీవేత్తలను స్పూర్తిగా తీసుకొని కళలు అంతరించిపోకుండా కాపాడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం దేవస్థానం ఈఒ రమాదేవి, ఆర్డీవో రత్నకల్యాణి, ఏఈవో శ్రావణ్‌కుమార్, ఏవో రామకృష్ణ, సీఐ నాగరాజురెడ్డి, గ్రామ పంచాయతీ ఈఒ వెంకటేశ్వర్లు, ఐకెపిసిసి సీతారాములు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News