మొబైల్ ఫోన్లలో ఆపిల్ ఐఫోన్‌కి (I Phone) ఉన్న క్రేజ్ వేరు. ధర ఎంతైనా సరే ఐఫోన్ కొనడానికి వెనుకాడరు కొందరు. ఐఫోన్ చేతిలో ఉందంటే చాలు.. వాళ్లు తమకు తాము గొప్పగా ఫీల్ అవుతారు. తాజాగా ఐఫోన్ 17 సిరీస్‌ని లాంచ్ చేశారు. దీని విక్రయాలు శుక్రవారం నుంచ ప్రారంభం అయ్యాయి. దీంతో విడుదలైన మొదటి రోజే ఐఫోన్‌ని దక్కించుకొనేందుకు యువత ఎగబడ్డారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ముంబైలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఐఫోన్ (I Phone) కోసం యువకులు గమ్మికూడారు. అంతటితో ఆగకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు కూడా వారిని అదుపు చేయడం మనం వీడియోలో మనం చూడవచ్చు. ఓ వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది బయటకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో అతడిపై సెక్యూరిటీ చెయి చేసుకున్నాడు. దీంతో ఆతడిక కూడా సెక్యూరిటీపై దాడి చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : శబరిమలలో బంగారం మాయం