Tuesday, October 15, 2024

లడ్డూ వివాదం..కాలి నడకన తిరుమలకు వెళ్లనున్న వైఎస్ జగన్

- Advertisement -
- Advertisement -

లడ్డూ వివాదం దుమారం రేపుతున్న సమయంలో ఎపి మాజీ సిఎం జగన్ మరో నిర్ణయం తీసుకున్నారు. కాలి నడకన తిరుమలకు వెళ్లి శ్రీవెంకటేశ్వ రస్వామిని దర్శంచుకోనున్నారు. ఓవైపు ఎపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి నేతలు ఇప్పటికే ప్రాయశ్చిత్త దీక్షలు చేపట్టారు. ఆలయాల శుద్ధి కార్యక్రమాలు చేపట్టి స్వామివారికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తం చేసుకుందామని పిలుపు నిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ సెప్టెంబర్ 28న పాప ప్రక్షాళణ పూజలు చేయాలని వైసిపి శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరుమల అంశంలో చంద్రబాబు చేసిన పాపానికి ప్రక్షాళణగా పూజలు చేస్తామని జగన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News