- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలంలో దారుణం వెలుగులోకి వచ్చింది. జి కొట్టాల గ్రామంలో సతీష్ రెడ్డి అనే వైఎస్ఆర్ సిపి పార్టీలో చురుకైన కార్యకర్తగా పని చేస్తున్నారు. సతీష్ రెడ్డికి ఆస్తి వివాదాలు ఉన్నాయి. సతీష్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టిడిపి కార్యకర్తలు సతీష్ ను చంపి ఉంటారని వైసిపి కార్యకర్తలు ఆరోపణలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత భూములు పంచాయతీలు బయటకు తీసి వైసిపి కార్యకర్తలపై టిడిపి కార్యకర్తలు దాడులు తెగబడుతున్నారని ఆరోపణలు చేశారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: గ్రూప్-1 నియామకాలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
- Advertisement -