- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రారంభంకాగానే గందరగోళం నెలకొంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసిపి వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానాన్ని చైర్మన్ కొయ్యే మోషేనురాజు తిరస్కరించారు. వాయిదా తీర్మానంపై చర్చ చేయాలని వైసిపి పట్టుబడుతోంది. సభలో నినాదాలతో వైసిసి సభ్యులు హోరెత్తించారు. పిపిపి విధానం రద్దు చేయాలని వైసిపి సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వైసిపి సభ్యులు ఆందోళన చేయడంతో శాసన మండలి రెండో సారి వాయిదా పడింది. కానీ బిఎసి సమావేశం జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
- Advertisement -