Sunday, June 16, 2024

జర్మనీలో రిక్రూట్ అయ్యే నర్సులకోసం…

- Advertisement -
- Advertisement -

జర్మనీలోని టామ్‌కామ్, ఫెడరల్ ఎంప్లాయ్మంట్ ఏజెన్సీ మధ్య కొనసాగుతున్న ‘ట్రిపుల్ విన్ పార్టనర్షిప్‘ లో భాగంగా జర్మనీలో రిక్రూట్ అయ్యే నర్సుల కోసం జర్మన్ భాషా శిక్షణకు ప్రత్యేక స్క్రీనింగ్, ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇందుకు మే 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని టామ్‌కామ్ సిఈఓ కార్యాలయం సూచించింది. జిఎన్‌ఎం/బిఎస్‌సి పూర్తి చేసిన . 21-38 సంవత్సరాల వయస్సులోపు తెలంగాణలోని గుర్తింపు పొందిన కళాశాలల నుండి నర్సింగ్, ఐసియు, జెరియాట్రిక్స్ లేదా ఆర్థోపెడిక్స్ , సైకియాట్రీ, కార్డియాలజీ, నియోనాటల్, సర్జికల్ వార్డు మొదలైనవాటిలో కనీసం 1-3 సంవత్సరాల ప్రొఫెషనల్, క్లినికల్ పనిచేసిన అనుభవం, జర్మన్ భాషా నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు తమ బి1 భాషా శిక్షణను భారతదేశంలో విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత జర్మనీలో నర్సింగ్ అసిస్టెంట్‌గా పని చేసే అవకాశం ఉంటుంది.

జర్మనీలో బి2, గుర్తింపు పరీక్షను క్లియర్ చేసిన తర్వాత రిజిస్టర్డ్ నర్సుగా ప్రమోట్ చేయబడతారు. కనీస జీతం 2300- 2800 యూరోలు. (ఓవర్ టైం అలవెన్సులు మినహాయించి). ఉచిత శిక్షణ ఉంటుందని తెలిపారు. జర్మన్ భాషా పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఎంపిక చేసిన అభ్యర్థులకు ప్లైపెండ్ చెల్లించబడుతుందని వివరించారు. (ఎ2 పరీక్షను క్లియర్ చేసిన తర్వాత యూరోలు 250, బి1 పరీక్షను క్లియర్ చేసిన తర్వాత యూరోలు 250) ఈ కార్యక్రమం కింద ఆమ్‌కామ్, జర్మన్ భాగస్వామ్యం ద్వారా అన్ని వీసా, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ, వన్-వే విమాన టిక్కెట్లు ఉచితంగా అందించబడతాయి. ఎన్‌రోల్‌మెంట్ గురించి మరిన్ని వివరాల కోసం ఆసక్తిగల అభ్యర్థులు ఫోన్ 9908830438, 8919047600, 7032379066, 8499990304 అదనపు సమాచారం కోసం www.tomcom.telangana.gov.in సందర్శించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News