Sunday, June 16, 2024

ఇంత సున్నితంగా వ్యవహరిస్తే ఎలా?

- Advertisement -
- Advertisement -

ఇసి ఆదేశాలపై ఏచూరి ఆగ్రహం

న్యూఢిల్లీ: తమ ఫిర్యాదులలో లేవనెత్తిన అంశాలను ఎన్నికల కమిషన్ జారీచేసిన ఆదేశాలలో ప్రస్తావించలేదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శించారు. ఎన్నికల నిబంధనావళికి సంబంధించి జరిగిన తీవ్ర ఉల్లంఘనల పట్ల ఎన్నికల పట్ల ఎన్నికల కమిషన్ సున్నితంగా వ్యవహరించడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర బిజెపి నాయకులు చేసిన మతపరమైన ప్రసంగాలపై తాము ఇచ్చిన ఫిర్యాదులలో ఏ ఒక్క అంశాన్ని ఇసి తన ఆదేశాలలో ప్రస్తావించలేదని ఎక్స్ వేదికగా ఆయన ఆరోపించారు.

ఎన్నికల నిబంధనావళికి సబంధించి జరిగిన తీవ్ర ఉల్లంఘనలపై ఇసి సున్నితంగా వ్యవహరించడం, సంయమనం పాటించండి, మర్యాదగా తప్పకండి అంటూ రాజకీయ పార్టీలకు హితవు చెప్పడం వల్ల పోయిన ఇసి ప్రతిష్ట తిరిగి రాదని ఏచూరీ వ్యాఖ్యానించారు. బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాకు ఇసి పంపిన లేఖను కూడా తన పోస్టుకు జతచేశారు. ఎన్నికల నియమావళి కచ్ఛితంగా అమలు జరిగేలా ఇసి చర్యలు ఉండాలని ఆయన కోరారు. కుల, మత, భాష, మత పరమైన ఉపన్యానాలు చేయరాదని ఆదేశిస్తూ బిజెపి, ఇతర పార్టీలకు ఇసి బుధవారం లేఖ రాసింది. రక్షణ రంగానికి సంబంధించిన అంశాలను రాజకీయం చేయవద్దని కాంగ్రెస్ పార్టీని ఇసి ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News