Saturday, April 27, 2024

నీరజ్‌కు స్వర్ణం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఫిన్లాండ్‌లో జరుగుతున్న కోర్టానె క్రీడల్లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ పోటీల్లోనే పసిడి పతకం సాధించి నీరజ్ చరిత్ర సృష్టించాడు. శనివారం జరిగిన ఫైనల్లో నీరజ్ 86.69 మీటర్ల దూరంలో ఈటెను విసిరి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే ఇటీవలే నీరజ 89.30 మీటర్ల ప్రదర్శనతో జాతీయ రికార్డును నెలకొల్పిన విషయ తెలిసిందే. కానీ కోర్టానె క్రీడల్లో మాత్రం నీరజ్ ఆ రికార్డును అందుకోలేక పోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News